షర్మిల గారు... డేట్, టైమ్ మీరు చెప్పినా సరే..: వైసిపి ఎమ్మెల్యే సవాల్ 

Published : Jan 24, 2024, 10:25 AM ISTUpdated : Jan 24, 2024, 10:42 AM IST
షర్మిల గారు... డేట్, టైమ్ మీరు చెప్పినా సరే..: వైసిపి ఎమ్మెల్యే సవాల్ 

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిలను వైసిపి నాయకులు టార్గెట్ చేసారు. తాజాగా ఆమె బాలయ్య డైలాగ్ తో ఏపీ అభివృద్దిపై ఛాలెంజ్ చేయగా వైసిపి ఎమ్మెల్యే దాన్ని స్వీకరించారు.

పల్నాడు : ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విసిరిన సవాల్ ను వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్వీకరించారు. నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ సినిమా డైలాగ్ తో ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ప్లేస్, డేట్, టైమ్ నువ్వే చెప్పు... వైసిపి పాలనలో గురజాల రూపురేఖలు ఎలా మారాయో చూపిస్తానంటూ షర్మిలకు ఛాలెంజ్ చేసారు ఎమ్మెల్యే మహేష్. 

 వీడియో

జగనన్న సైనికుడిగా, పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా షర్మిల సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. గుంటూరు, విజయవాడలో కూర్చుని సవాల్ చేయడం కాదు... గురజాల గల్లీలోకి వస్తే అభివృద్ది ఏమిటో చూపిస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ది బాటలో నడుస్తోందని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. 
 
వైఎస్ షర్మిల ఏమన్నారంటే : 

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరణ సమయంలో సొంత అన్నను జగన్ రెడ్డి అంటూ సంబోధించారు షర్మిల. అంతేకాదు వైసిపి పాలనతో రాష్ట్రంలో అభివృద్ది జరగడంలేదని అన్నారు. ఆమె వ్యాఖ్యలపై వైసిపి  నేత వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ... పక్కరాష్ట్రం నుండి కొత్తగా వచ్చిన షర్మిలకు అభివృద్ది కనిపించనట్లుందని అన్నారు. కావాలంటే ఆమెకు రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూపిస్తామని సవాల్ విసిరారు. 

చిన్నాన్న సుబ్బారెడ్డి సవాల్ పై షర్మిల రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అనడం వైవి సుబ్బారెడ్డి గారికి నచ్చనట్లుంది... అయితే జగనన్న అని అనడానికీ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని షర్మిల తెలిపారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది గురించి తనకేమీ తెలియదంటూ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూపిస్తానంటూ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు షర్మిల తెలిపారు. సరే సార్... మీరు చేసిన అభివృద్ది ఏమిటో చూపించండి? అని షర్మిల సెటైరికల్ గా కామెంట్స్ చేసారు. వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూపించడానికి డేట్, టైమ్ ఫిక్స్ చేయాలని వైవి సుబ్బారెడ్డిని కోరారు షర్మిల. లేదంటే ఆ డేట్, టైమ్ తమను నిర్ణయించమన్నా అందుకూ సిద్దమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలోని మేధావులు, మీడియా అందరూ వస్తారు... అందరికీ ఆ అభివృద్దిని చూపించాలని షర్మిల సవాల్ విసిరారు. 

మీరు చేసిన డెవలప్ మెంట్ ఎక్కడ? కడతామన్న మూడు రాజధానులు ఎక్కడ? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఏమయ్యింది? అనేవి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారని షర్మిల అన్నారు. ఇవి ఎప్పుడు చూపిస్తారన్నా మేం రెడీ అంటూ ఏపిసిసి చీఫ్ షర్మిల సవాల్ చేసారు. ఈ ఛాలెంజ్ ను వైసిపి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్వీకరించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం