దమ్ముంటే నాపై పోటీచెయ్ ఆనం... ఓడితే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా..: అనిల్ యాదవ్ సవాల్

Published : Jun 25, 2023, 12:06 PM IST
దమ్ముంటే నాపై పోటీచెయ్ ఆనం... ఓడితే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా..: అనిల్ యాదవ్ సవాల్

సారాంశం

మాజీ మంత్రి ఆనం రాంనారాాయణ రెడ్డికి దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. 

నెల్లూరు : వైసిపి రెబల్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని... ఒకవేళ నేను ఓడితే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అనిల్ సవాల్ విసిరారు. లోకేష్ చేత నెల్లూరు టికెట్ కన్ఫర్మ్ చేసుకుని తనపై పోటీ చేయాలని... అప్పుడు ఎవరేందో తేలిపోతుందని అన్నారు. నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము అనం కి ఉందా..? అని అనిల్ యాదవ్ ప్రశ్నించారు. 

ఆనం రాంనారాయణ రెడ్డి రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే ఆయన రాజకీయం క్లోజ్ చేస్తానని అనిల్ యాదవ్ హెచ్చరించారు. అలా చెయ్యని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా లోకేష్ పాదయాత్రతో అధికారంలోకి వస్తామని టిడిపి నాయకులు కలలు కంటున్నారని అనిల్ ఎద్దేవా చేసారు. 

గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో వైసిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంకు ఆ పదవిలో కొనసాగడానికి సిగ్గుండాలని అనిల్ మండిపడ్డారు. వైసిపి నుండి సస్పెండ్ చేసినా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాజీనామా చేయడంలేదని అన్నారు. 

Read More  ‘‘ హాయ్ ఏపీ.. బైబై బీపీ ’’ కొత్త నినాదం అందుకున్న మంత్రి రోజా .. అర్ధం ఇదే

నెల్లూరు పట్టణం వైసిపి హయాంలో చాలా అభివృద్ది చెందిందని మాజీ మంత్రి అనిల్ పేర్కొన్నారు. టిడిపి హయాంలో నెల్లూరు అభివృద్ది జరిగిందని అంటున్న నాయకులు ఏ ప్రభుత్వంలో  ఎంత ఖర్చుపెట్టారో చర్చకు సిద్దమా అంటూ అనిల్ సవాల్ విసిరారు. ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని బీద తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా బీద వున్నపుడే ఆ పార్టీ నాశనం అయ్యిందన్నారు. టిడిపి హయాంలో కావలిలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధమా..? అని అనిల్ ఛాలెంజ్ విసిరారు. 

ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము బీద రవిచంద్రకు లేదని... టికెట్ ఇస్తానన్నా భయపడి పారిపోయే పిరికివాడు ఆయనంటూ వైసిపి ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ టికెట్ ఇవ్వకపోయినా తట్టుకునే గుండెధైర్యం తనకుందని మాజీ మంత్రి అనిల్ అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్