మళ్లీ వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు..?

Published : Jan 16, 2019, 01:07 PM IST
మళ్లీ వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు..?

సారాంశం

గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుతో గెలిచిన 20మందికిపైగా ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార టీడీపీ లోకి జంప్ చేశారు. 

గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుతో గెలిచిన 20మందికిపైగా ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార టీడీపీ లోకి జంప్ చేశారు. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కాగా.. ఏపీలో మళ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్లీ సొంత గూటివైపు చూస్తున్నట్లు సమాచారం.

కాగా.. వాళ్లని మళ్లీ తమ పార్టీలోకి చేర్చుకోవడం విషయంపై ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మళ్లీ తమ పార్టీలోకి ఆహ్వానించమని చెప్పారు. వాళ్లకు తమ పార్టీలో చేరే అర్హత లేదని అభిప్రాయపడ్డారు.  అనంతరం కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. ఆ విషయంలో తనకు క్లారిటీ లేదన్నారు. ఆమె నిజంగా పార్టీలో  చేరడానికి ఆసక్తి చూపిస్తే.. కచ్చితంగా చేర్చుకుంటామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్