కేసీఆర్ ప్రచారం.. టీడీపీకి 160సీట్లు ఖాయం.. కేశినేని నాని

Published : Jan 16, 2019, 12:19 PM IST
కేసీఆర్ ప్రచారం.. టీడీపీకి 160సీట్లు ఖాయం.. కేశినేని నాని

సారాంశం

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని ధీమా వ్యక్తం చేశారు. 

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 130సీట్లు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. అదే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కనుక వైసీపీ అధినేత జగన్ కి మద్దతుగా ప్రచారం చేస్తే.. తమ పార్టీకి 160సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

ఫెడరల్ ఫ్రంట్ లో చేరిక విషయమై...కేటీఆర్ ఈ రోజు జగన్ తో భేటీ కానున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై ఎంపీ కేశినేని నాని వ్యంగాస్త్రాలు సంధించారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్.. బీజేపీ అనుకూల ఫ్రంట్ ఈ రెండు మాత్రమే ఉన్నాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్.,. ఓ కిచిడీ ఫ్రంట్ అని అభిప్రాయపడ్డారు.

ఫ్రెడరల్ ఫ్రంట్ కోసం జగన్ తో చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయస్థాయిలో బీజేపీకి 130సీట్లు మించి రావని అభిప్రాయపడ్డారు. మోదీకి మద్దతు ఇచ్చేందుకే కేసీఆర్ ఈ ఫెడరల్ ఫ్రంట్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu