రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

Published : Dec 10, 2020, 08:42 AM IST
రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి టంగుటూరుకు చెందిన వైఎ‍స్సార్‌సీపీ నాయకుడు రావురి అయ్యవారయ్య, గాయపడిన వ్యక్తి కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన మండల ఇంచార్జ్‌ శ్రీహరిగా పోలీసులు గుర్తించారు. 

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీకొట్టడం తో ఓ వ్యక్తి  ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని స్థానికులు  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకొని విచారిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి టంగుటూరుకు చెందిన వైఎ‍స్సార్‌సీపీ నాయకుడు రావురి అయ్యవారయ్య, గాయపడిన వ్యక్తి కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన మండల ఇంచార్జ్‌ శ్రీహరిగా పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ వార్త విని వైసీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ నేత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా..  ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu