‘‘టీఆర్ఎస్, వైసీపీ పొత్తు.. చంద్రబాబు దుష్ప్రచారం’’

Published : Jan 18, 2019, 04:36 PM IST
‘‘టీఆర్ఎస్, వైసీపీ పొత్తు.. చంద్రబాబు దుష్ప్రచారం’’

సారాంశం

టీఆర్ఎస్ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని  వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని  వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన భూమన.. ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.

రాష్ట్రాల హక్కులను సాధించే క్రమంలో కేటీఆర్.. జగన్ మధ్య భేటీ జరిగిందని అన్నారు. దీనిపై చంద్బరాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు నాలుగేళ్ల రాజకీయ చరిత్ర అవినీతి, దుర్గంద మయమని విమర్శించారు. నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడింది మీరు కాదా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు.

విజయవాడ కనకదుర్గమ్మ దర్శానికి వచ్చిన కేసీఆర్ స్వాగత ఏర్పాట్లు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీత ఇంట్లో వివాహానికి కేసీఆర్ ని ఆహ్వానిస్తే లేని తప్పు.. జగన్ భేటీ అయితే వచ్చిందా అని అడిగారు. కేసీఆర్ చేపట్టిన ఛండీయాగంలో పాల్గొంది మీరేనని గుర్తుచేశారు.

జగన్ పేరు వింటనే చంద్రబాబు భయపడిపోతున్నారన్నారు. చంద్రబాబుకి ఇప్పటికే చాలా రుగ్మతలు ఉన్నాయని.. తాజాగా మానసిక రుగ్మత కూడా తోడు అయ్యిందని ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే