వైసిపికి రాజ్యసభ: విజయసాయే మాస్టర్ మైండ్

First Published Mar 12, 2018, 11:22 AM IST
Highlights
  • వైసిపి ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబునాయుడు ప్లాన్.

వైసిపికి రాజ్యసభ స్ధానం దక్కిందంటే విజయసాయి రెడ్డే అనటంలో నో డౌట్. వైసిపి ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబునాయుడు ప్లాన్. అయితే, ప్లాన్ అమలులో మాత్రం చంద్రబాబు దారుణంగా ఫైల్ అయ్యారు. అందుకు కారణం విజయసాయిరెడ్డి తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్లే ఫిరాయింపులు ప్రోత్సహించటంలో టిడిపి విఫలమైందనటంలో సందేహమే లేదు.

భర్తీ చేయాల్సిన మూడు స్ధానాల్లో ఎంఎల్ఏల బలాల ప్రకారం టిడిపికి రెండు స్దానాలు, వైసిపికి ఒక్కస్ధానం దక్కుతుంది. అయితే, రాజ్యసభ స్ధానానికి 44 ఓట్లు అవసరం. వైసిపికి సరిగ్గా 44 ఓట్లే ఉన్నాయి. అందులో నుండి ఒక్కటి తగ్గినా జగన్ కు పెద్ద దెబ్బే.

అటువంటి సమయంలోనే విజయసాయి రంగంలోకి దిగారు. తమ ఎంఎల్ఏలను అప్రమత్తం చేశారు. మంత్రులు, టిడిపి నేతలు వైసిపి ఎంఎల్ఏలు ఎవరితో టచ్ లోకి వెళ్ళినా తనకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మామూలుగానే టిడిపి ఫ్రలోభాలకు దిగింది. మంత్రులు వైసిపి ఎంఎల్ఏలతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులు విజయసాయి వద్దకు చేరినట్లు జగన్ మీడియానే స్పష్టంగా ప్రకటించటం గమనార్హం. సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర ప్రలోభాలపై చేసిన ప్రకటన కూడా సంచలనం రేపింది

దాంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. తాము ఎవరితో మాట్లాడినా, మాట్లాడించినా బయటకు పొక్కుతున్న విషయం గ్రహించారు. అదే సమయంలో కేంద్రం నుండి కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. మిత్రపక్షం బిజెపి సహకారంపై అనుమానాలు మొదలయ్యాయి. అన్నీ వైపుల నుండి సమస్యలు కమ్ముకోవటంతో చేసేది లేక రెండు స్ధానాలకు మాత్రమే పోటీ పెట్టి పరువు నిలుపుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.

చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసిన ఘనతైతే విజయసాయిదే.  ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా, ఎన్నికల కమీషన్ ను అప్రమత్తం చేయాలన్నది కూడా విజయసాయి ప్లానే. దాంతో వైసిపికి దక్కుతుందో దక్కదో అని అనుమానంగా ఉన్న రాజ్యసభ స్ధానంలో వైసిపి ఏకగీవ్రంగా గెలుచుకోవటంలో విజయసాయి మాస్టర్ మైండే కారణం.

 

click me!