కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ దారుణ హత్య: అర్థరాత్రి దాటిన తర్వాత...

Published : Feb 12, 2021, 09:51 AM IST
కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ దారుణ హత్య: అర్థరాత్రి దాటిన తర్వాత...

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత కత్తులతో పొడిచి కార్పోరేటర్ ను చంపారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ కార్పోరేటర్ రమేష్ ను కత్తులతో పొడిచి హత్య చేశారు. కాకినాడ రూరల్ గంగరాజ్ నగర్ లో ఈ హత్య జరిగింది. 

గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కార్పోరేటర్ రమేష్ ను హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

రమేష్ హత్యకు రాజకీయ కక్షలు కారణమా, ఆర్థిక లావాదేవీలు కారణమా అనే కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్