
హైదరాబాద్ బిర్యానీకి విపరీతంగ డిమాండ్ పెరిగేందుకు కారణం ఎవరు?
ఎవరో నిజాం నవాబు కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడట.
వైసిపి ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స కమిటీ ఛెయిర్మన్ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ విషయం వెల్లడించారు.
ముఖ్యమంత్రి ద్రబాబు నాయుడు నిర్వహించిన సిఐఐ సదస్సుల ఖర్చు తడిసి మోపెడయితే ఏముంది లే, హైదరాబాద్ బిర్యానీ గ్లోబలైజ్ అయిందని ఆయన చెప్పారు.
విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుకుదిరాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వుత్తదని, అందులో ఏమీ లేదని చెబుతూ చంద్రబాబు బిర్యానీకి మంచిపేరొచ్చింది మాత్రమే నిజనమని ఆయన అన్నారు.
ఆయన సదస్సులు సాధించిందేదయినా ఉంటే అది ’గ్లోబలైజేషన్ ఆఫ్ బిరియాని‘ యే అని చెప్పారు.
‘తర్వాత మరొకటేదయినా జరిగిందంటే - వచ్చినోళ్లందరికి చార్మినార్ బొమ్మలిచ్చి ఆయన చార్మినార్ కు కూడా మంచి గుర్తింపు తెచ్చాడు, ‘ అని అన్నారు.
‘రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే దావోస్ వెళ్లాలా.. లేదంటే రావా. అయితే, దావోస్ వెళ్లకుండానే మీకంటే రెట్టింపు అభివృద్ధి వైయస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఎలా సాధించారు. కరుణానిధి, జయలలితలు దావోస్ వెళ్లకుండానే వందల కిలోమీటర్ల పారిశ్రామిక కారిడార్‌లు తమిళనాడులో ఏర్పాటు చేసుకోలేదా? మీ పర్యటనలు, పేపర్ పబ్లిసిటీ మూలంగా వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది,’అని బుగ్గన అన్నారు.
చంద్రబాబు ఇప్పటికే 13 సార్లు దావోస్ వెళ్లారు. ఏం సాధించారు. ఒక్క పెద్ద పరిశ్రమైనా ఏపీకి వచ్చిందా.. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం కల్పించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 జాతీయ పత్రికల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనుకోవడం పొరపాటనివ్యాఖ్యానించారు.
సీఐఐ సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడుల మీద ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్‌తో ఓ కమిటీ వేయించి శ్వేతపత్రం విడుదల చేయాలని బుగ్గన డిమాండ్ చేశారు.