పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు: ముగ్గురి పేర్లను ప్రకటించిన జగన్

By narsimha lode  |  First Published Jul 19, 2022, 9:22 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. ఈ మూడు స్థానాల్లో విజయం కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 


అమరావతి:An dhra Pradesh  రాష్ట్రంలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ,చేసే అభ్యర్ధులను YCP  ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉందని  ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నొక్కి చెప్పారు., గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సీఎం YS Jagan ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు విషయమై ప్రజల స్పందనను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

త్వరలో జరగనున్న Graduate MLC  Election ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్థానానికి ప్రస్తుత బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ సుధాకర్ పేరు ఖరారు చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు స్థానానికి శ్యాం ప్రసాద్ రెడ్డిని అభ్యర్ధిగా బరిలోకి దింపనున్నారు.కర్నూల్, కడప, అనంతపురం స్థానానికి  చెన్నపూస రవి పేరును ఖరారు చేసింది వైసీపీ.

Latest Videos

undefined

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు సీఎం జగన్. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వియం సాధించి అధికారం చేపట్టిన జగన్ ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.. విపక్షాలు ఆశించిన స్థాయిలో సీట్లను, ఓట్లను ఈ ఎన్నికల్లో సాధించలేదు. టీడీపీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా ఆ పార్టీ  ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

 స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.  అధికార పార్టీ అక్రమాలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే అక్కడక్కడ టీడీపీ అభ్యర్ధులు పోటీ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు, ఓట్లు దక్కలేదు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ గెలుపొందింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన కుప్పంలో వైసీపీ ఘన విజయం సాధించింది.ఈ పరిణామాలతో  త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేయాలని సీఎం జగన్  నిర్ణయం తీసుకున్నారు.
 

click me!