పాతకాలంనాటి ఫోన్ కోసమే మహిళ దారుణ హత్య.. ఆ తరువాత ఏమీ తెలియనట్టు....

By SumaBala Bukka  |  First Published Jul 19, 2022, 7:30 AM IST

పాతకాలంనాటి ల్యాండ్ ఫోన్ కోసమే విజయవాడలో మహిళను హత్య చేసినట్లు తేలింది. పాత ఫోన్లకు లక్షల్లో డబ్బులు ఇస్తామని కొన్ని ముఠాలు ఆశపెట్టడంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. 


విజయవాడ : సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని రైల్వే ఉద్యోగి భార్య సీత (50) murder caseలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న పాతకాలం నాటి old land phone కోసమే ఈ మధ్య జరిగినట్లు బయటపడింది. ఈ కేసులో చాలామంది ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రైల్వే ఉద్యోగుల పాత్రపైన కీలక సమాచారం లభించినట్లు సమాచారం. పాత ల్యాండ్ ఫోన్లు. టీవీలు ఉంటే లక్షల్లో డబ్బు ఇస్తామని కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. పాతకాలంనాటి ల్యాండ్ ఫోన్ రైల్వే ఎస్అండ్ టీ శాఖకు చెందిన సీత భర్త సత్యనారాయణ వద్ద ఉన్నట్లు అతని స్నేహితులకు తెలిసింది.

అప్పటినుంచి దానిపై కన్నేసిన దుండగులు ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఫోన్ దొరికితే లక్షల్లో డబ్బులు వస్తాయని గ్రహించి, ఆయన ఇంట్లో లేని సమయంలో పథకం ప్రకారమే అక్కడికి వెళ్లారు. ఫోన్ కోసం మృతురాలితో గొడవపడి, పెనుగులాటలో  హత్య చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ తో పాటు మహిళ మెడలో బంగారం, డబ్బు ఎత్తుకు వెళ్లారు. 

Latest Videos

undefined

గోదావరికి పోటెత్తిన వరద: నరసాపురం వద్ద కోతకు గురైన రివర్ బండ్

కాల్ డేటాతో..
హత్య జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు.  దీంతో సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని సెల్ టవర్లు అన్నింటిని జల్లెడ పట్టారు పోలీసులు. కీలక సమాచారాన్ని రాబట్టారు.  దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఓ రైల్వే ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్టు తేలింది. అయితే అతడు తనకు ఏమీ తెలియనట్లు హత్య జరిగినప్పటినుంచి అక్కడే తచ్చాడుతున్నాడు.  డాగ్ స్క్వాడ్  సిబ్బంది ఆధారాలు సేకరిస్తుండగా.. జాగిలాలు ఆ ఉద్యోగిని పట్టించాయి.

పోలీసులకు సవాల్ గా..
హత్య జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టినా.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నగర సిసిఎస్ పోలీసులకు కేసును అప్పగించారు. నార్త్ ఏసిపి రమణమూర్తి,  సీసీఎస్ సీఐ రామ్ కుమార్, సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ  ఆధ్వర్యంలో పోలీసు బృందం విచారణ చేపట్టి హత్యకేసును చేదించారు. మంగళవారం పోలీసు అధికారులు నిందితులను అరెస్టు చూపించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 

click me!