అమరావతిని ఇంగ్లీషులో రాసి ఇప్పుడేంటి గొడవ:బాబుకు యార్లగడ్డ కౌంటర్

By Nagaraju TFirst Published Nov 1, 2018, 3:23 PM IST
Highlights

తెలుగువారి ఆత్మగౌరవం అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి అర్థం మార్చేశారని మండిపడ్డారు. అధికారమే ఆత్మగౌరవంగా మారిపోయిందని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవం విషయంలో సీఎం చంద్రబాబు కంటే కేసీఆర్ నయం అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. 

ఢిల్లీ: తెలుగువారి ఆత్మగౌరవం అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి అర్థం మార్చేశారని మండిపడ్డారు. అధికారమే ఆత్మగౌరవంగా మారిపోయిందని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవం విషయంలో సీఎం చంద్రబాబు కంటే కేసీఆర్ నయం అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. 

అమరావతి రాజధాని నిర్మాణం శిలాఫలకాన్ని ఇంగ్లీషులో వేయించి ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగువారి రాజధాని అమరావతి నిర్మాణ శిలాఫలకాన్ని ఆంగ్లంలో వేయించినప్పుడే ఆత్మగౌరవం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుభాష పట్ల ఏపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని యార్లగడ్డ ఆరోపించారు. తెలుగు భాషా సంస్కృతిలకు ఏపీ ప్రభుత్వం చెయ్యాల్సినంత కృషి చెయ్యడం లేదని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత  ఇచ్చారని గుర్తు చేశారు. 

ఒకటో తరగతి నుంచి తప్పనిసరిగా  ప్రభుత్వ, ప్రభుత్వేతర, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఉండాల్సిందేనని చట్టం తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ గడ్డపై ఏ పాఠశాల ఉన్నప్పటికీ అందులో తప్పనిసరిగా తెలుగు ఉపాధ్యాయుడు ఉండాలని చట్టం తీసుకువచ్చి దాన్ని అమలు చేయనున్నారని చెప్పారు.  
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్తూ తెలుగును మరచిపోయేలా ప్రవర్తిస్తోందని అన్నారు. ఆఖరికి అంగన్వాడీ కేంద్రాల్లో సైతం తెలుగును తొలగించి ఆంగ్లాన్నే బోధించాలని ఆదేశించారని ఇది చాలా దురదృష్టకరమన్నారు. 

click me!