ఉద్యోగుల జీతాలకూ డబ్బు లేదు

First Published Jan 3, 2018, 7:42 AM IST
Highlights
  • ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి చాలా దారుణంగా దిగజారిపోయింది.

ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి చాలా దారుణంగా దిగజారిపోయింది. ఆశించిన ఆదాయాలు రాకపోవటంతో దండగమారి ఖర్చులు పెరిగిపోతుండటంతో ఖజానా కుప్పకూలిపోయింది. వాస్తవ పరిస్ధితి ఈ విధంగా ఉన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం ‘మాటలతో కోటలు’ కడుతున్నారు. ఇది ఎవరో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు కాదు. స్వయంగా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాటల ప్రకారమే ఖజానా అంతా డొల్లగా తయారైంది.

 జన్మభూమి కార్యక్రమంలో యనమల మాట్లాడుతూ, ‘తాళం నావద్దే ఉంది. పెట్టె మాత్రం ఖాళీగా ఉంది. ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బు లేదు’ ఇది ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ‘జన్మభూమి-మనఊరు’ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఉద్యోగుల జీతాలు చెల్లించటానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్ధితి అంటూ వాపోయారు. గత ఏడాది రూ. 1.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఇంకా రూ. 20 వేల కోట్ల లోటుతో ప్రభుత్వం నడుస్తోందంటూ మంత్రి చెప్పారు. యనమల చెప్పిన తాజా లెక్కలతో ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితేంటో స్పష్టమవుతోంది.

ఖజానాలో డబ్బు లేకపోయినా 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం ప్రజారంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నామంటూ చెప్పటం విచిత్రంగా ఉంది. ఖజానా లోటు బడ్జెట్ లో ఉంటే ప్రజారంజక బడ్జెట్ ఎలా సాధ్యమో యనమలే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 14 లక్షల ఇళ్ళ నిర్మాణం పేరుతో రూ. 6 వేల కోట్లను దోచుకున్నారట. అందుకే తమ ప్రభుత్వం ఆచుతూచి అడుగేస్తోందనే అరిగిపోయిన రికార్డును వినిపించారు.

 

 

 

 

 

 

click me!