‘‘ఏం రాసినా సరే’’ జనసేన కార్యకర్తలకు యామినీ స్ట్రాంగ్ వార్నింగ్

sivanagaprasad kodati |  
Published : Oct 19, 2018, 12:40 PM IST
‘‘ఏం రాసినా సరే’’ జనసేన కార్యకర్తలకు యామినీ స్ట్రాంగ్ వార్నింగ్

సారాంశం

తక్కువ సమయంలోనే ప్రత్యర్థి పార్టీల నేతలకు పదునైన మాటలతో కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డారు టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని. ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తరచుగా విమర్శలు చేస్తున్నారు.

తక్కువ సమయంలోనే ప్రత్యర్థి పార్టీల నేతలకు పదునైన మాటలతో కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డారు టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని. ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తరచుగా విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆమెపై కొందరు జనసేన అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతున్నారు. యామినీని ఉద్దేశిస్తూ బయటకి చెప్పలేని విధంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. కొన్నాళ్లుగా ఉపేక్షిస్తున్నప్పటికీ జనసేన కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో యామినీ కౌంటర్ ఇచ్చారు.

నిత్యం ఆదిపరాశక్తిని పూజించే నన్ను, ఈ దేవి నవరాత్రులలో ఒక మహిళ అని కూడా చూడకుండా కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు..  సంస్కృతి, సంస్కారం , మర్యాద కూడా లేకుండా నన్ను నా కుటుంబం సభ్యులను ఎంతగానో బాధించే విధంగా చెప్పుకోలేని విధంగా పోస్టులు పెట్టారు..

వాళ్ళ కుటుంబంలో మహిళలుకి కూడా నా లాంటి పరిస్తితి వస్తే.. వాళ్ల కుటుంబం పరువు ఎలా పోతుందో వాళ్ళ సంస్కారానికి వొదిలేస్తున్నా.. కానీ అతితోందరలో వాళ్ళు పశ్చాత్తాపం పడే రోజు తప్పకుండా వస్తుంది..

స్త్రీని బాధ పెట్టి, కన్నీటిని తెప్పించినవాడిని ఆ భగవంతుడు కూడా క్షమించడు, ఇది నేను పూజించే నా అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా.. ఇలాంటి సంస్కారం, సంస్కృతి, మర్యాదలేని హీనులు ఎంత మంది అరిచినా, నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను.. నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’’ అంటూ యామినీ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. 
 

 

పవన్‌పై వ్యాఖ్యలు: యామినీకి మాధవీలత స్ట్రాంగ్‌ కౌంటర్

అంతా సెట్ చేయడమంటే సినిమా సెట్ వేసినట్లు కాదు... పవన్‌కు యామినీ కౌంటర్

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్