పవన్‌పై వ్యాఖ్యలు: యామినీకి మాధవీలత స్ట్రాంగ్‌ కౌంటర్

sivanagaprasad kodati |  
Published : Oct 19, 2018, 12:12 PM IST
పవన్‌పై వ్యాఖ్యలు: యామినీకి మాధవీలత స్ట్రాంగ్‌ కౌంటర్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ చేసిన వ్యాఖ్యలపై.. పవన్ అభిమాని, సినీనటి మాధవీలత సోషల్ మీడియా సాక్షిగా మండిపడ్డారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ చేసిన వ్యాఖ్యలపై.. పవన్ అభిమాని, సినీనటి మాధవీలత సోషల్ మీడియా సాక్షిగా మండిపడ్డారు. "ఇన్నాళ్లు పోనీలే అని ఊరుకున్నా.. ఇప్పుడు నాకు కాలింది.  మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో..? చూసినప్పుడు అడగాలి కదా ఇప్పుడెందుకు అడగటం..? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా..? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా తెలియదులేమ్మా..!

కవాతు దేనికోసమా....? ఏం చేశాడనా....? ఏం చేయలేదు అమ్మా ఏదో మీరు చేయలేనివి ఆయన చేసేద్దామనే తపన అంతే. ప్రజలకోసం వద్దు.. ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడవటమే ఎందుకంటే మీకు పీకడానికి, చెప్పడానికి వేరే కంప్లైంట్స్ లేవు కదా....?

మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడు.. నిన్నేమో ఎవడో డబ్బులు ఖర్చుపెట్టాడు.. మీ అయ్యలు ఇచ్చారా..? మీ తాతలు ఇచ్చారా..? ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు..? పైసల్ ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా....? ఉంటదిలే కడుపులో మంట.

‘ఈనో’ అని ఎప్పుట్నుంచో ఉంది అది తాగితే తగ్గుద్దేమో మరి. పనిచేయకపోతే అపోజిషన్ అనేది ప్రశ్నించాలి కానీ అసలు మొదలెట్టకుండా ఆపడం కాదు.. ఇకనైనా నేర్చుకొండి" అని ఫేస్‌బుక్‌లో యామినీకి మాధవీ లత స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.

ధవళేశ్వరం వద్ద నిర్వహించిన పాదయాత్రలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీసీ అధినేత వైఎస్ జగన్, మంత్రి లోకేశ్‌లను టార్గెట్ చేసి ఫైరయ్యారు..

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ మాట్లాడుతూ.. వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదని.. పావలాకు కూడా చెల్లని పవన్.. రెండు వేల రూపాయిల నోటువంటి లోకేశ్ గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమన్నారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతిగా మాధవీలత.. యామినీని టార్గెట్ చేశారు. మరి మాధవీ కామెంట్స్‌పై సాధినేని ఏ విధంగా కౌంటరిస్తారో వేచి చూడాలి. 

 

అంతా సెట్ చేయడమంటే సినిమా సెట్ వేసినట్లు కాదు... పవన్‌కు యామినీ కౌంటర్

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే