హుర్రే.. ఇకపై ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటినుండంటే...

Published : Jan 09, 2024, 12:35 PM IST
హుర్రే.. ఇకపై ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటినుండంటే...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి రాబోతోంది. ఇకపై బస్సుల్లో ప్రయాణించాలంటే డబ్బులు అక్కర్లేదు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మహిళా ప్రయాణికులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండబోతోంది. కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల తరహాలో ఏపీఎస్ఆర్టీసీ లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టబోతున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులో ఈ ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం మీద వస్తున్న పాజిటివిటీని అంచనా వేసి మొదట టిడిపి తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టింది. ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ఈ హామీని ఇచ్చారు కూడా. మహిళల ఫ్రీ జర్నీ స్కీం మీద విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అధికార వైసిపి ఈ స్కీంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు సానుకూలంగా స్పందిస్తుండడంతో దీనిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఎన్నికలు వచ్చేదాకా ఆగి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో వైసిపి ముందుగానే పావులు కలుపుతోంది.  సంక్రాంతి తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలుకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తీసుకుంది. దీనిని అమలు చేస్తే సంస్థపై ఇంకెంత భారం పడుతుంది.  

ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో బాబు, పవన్ భేటీ: బోగస్ ఓట్లపై ఫిర్యాదు

కర్ణాటక తెలంగాణలో అమలు చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాల మీద కూడా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నాయో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి లగ్జరీ బస్సుల్లో మహిళలకు రాయితీ ఇవ్వడంపైన సాధ్యసాద్యాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకుముందే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలను ఎలా చెప్పి పెట్టాలని కూడా ఆలోచనలు చేస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రూ. 300 కోట్లు జీతాలు చెల్లిస్తుంది. ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే అందులో 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు.  ఈ మొత్తం కలిసి రోజుకు రూ.17 కోట్ల ఆదాయం ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీకి వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టినట్లయితే నాలుగు కోట్ల రూపాయల మేరకు ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. దీని మీద ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో సంక్రాంతికి ఈ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్