చనిపోయిన సంవత్సరానికి.. ఇంటికి మృతదేహం

Published : Dec 08, 2018, 11:46 AM ISTUpdated : Dec 08, 2018, 02:49 PM IST
చనిపోయిన సంవత్సరానికి.. ఇంటికి మృతదేహం

సారాంశం

ఆమె చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత ఆమె కటుంబసభ్యులు.. మృతదేహం కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 368 రోజులు ఎదురుచూశారు.

ఓ మహిళ చనిపోయిన దాదాపు సంవత్సరం తర్వాత.. ఆమె మృతదేహం ఇంటికి చేరింది.  ఆమె చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత ఆమె కటుంబసభ్యులు.. మృతదేహం కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 368 రోజులు ఎదురుచూశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కేశనకుర్తి పద్మావతి(45)కి భర్త చనిపోయాడు. అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తూ.. కొడుకు, కుమార్తెను చదివించి..పెంచి పెద్దచేసింది.  కొవ్వూరు ఇందిరమ్మ కాలనీలో అప్పుచేసి ఇల్లు కట్టుకుంది. అప్పులు ఎక్కువై.. జీవనం కష్టం కావడంతో.. తెలిసిన వారి సలహాతో 2015 నవంబర్ లో సౌదీ అరేబియా వెళ్లింది.

ఆమె తిరిగి 2017లో రావాల్సి ఉంది. కాగా.. 2017 నవంబర్ 23వ తేదీన తన సోదరుడికి ఫోన్ చేసి.. సౌదీలో తన ఇంటి యజమాని దారుణంగా కొడుతున్నాడంటూ చెప్పింది. డిసెంబర్ 4వ తేదీన బయలుదేరి వస్తున్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి ఫోన్ రాలేదు. అయితే.. అక్కడే ఆమె చనిపోయిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ద్వారా కుటుంబసభ్యులు తెలుసుకోగలిగారు.

తన తల్లి మృతదేహం తమకు అప్పగించాలని..ఆమె కుమారుడు మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మణిక్యాలరావును ఆశ్రయించారు. కాగా.. అప్పటి నుంచి ప్రయత్నించగా.. సంవత్సరం తర్వాత ఆమె మృతదేహం ఇంటికి చేరింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?