బాలకృష్ణకు షాక్..వైసీపీలోకి హిందూపురం మాజీ ఎమ్మెల్యే

By ramya neerukondaFirst Published Dec 8, 2018, 10:17 AM IST
Highlights

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. హిందూపురంలో మొన్నటి వరకు బాలకృష్ణకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ..శనివారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ  పార్టీ కండువా కప్పుకున్నారు.

హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఊహించని షాక్ తగిలింది.  ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. హిందూపురంలో మొన్నటి వరకు బాలకృష్ణకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ..శనివారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ  పార్టీ కండువా కప్పుకున్నారు.

30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ.. పార్టీకి కృషి చేసినా.. తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న కారణంతో పార్టీని వీడినట్లు అబ్దుల్ ఘనీ ఈ సందర్భంగా తెలిపారు.నాలుగేళ్లుగా మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పంచిన ఘనత వైఎస్ఆర్ దేనని అన్నారు.

హిందూపురం ఎమ్మెల్యేగా 2004, 2009లో అబ్దుల్ ఘనీ టీడీపీ  తరపున పోటీచేసి గెలిచాడు. 2014లో బాలకృష్ణ కోసం తన స్థానాన్ని వదులుకున్నాడు. పార్టీ అధిష్టానం మేరకు టికెట్ వదులుకున్నాడు. నాలుగేళ్లుగా పార్టీ కోసమే కృషి చేస్తున్నాడు. 2019లో వచ్చే ఎన్నికల్లోనూ ఆ టికెట్ మళ్లీ బాలకృష్ణకు దక్కనుంది. దీంతో ఇంకెప్పటికీ తనకు టీడీపీ నుంచి టికెట్ లభించే అవకాశం లేదన్న విషయం ఘనీకి అర్థమైంది.  అదే సమయంలో వైసీపీ నుంచి టికెట్ ఆఫర్ చేయడంతో.. ఆయన ఈ రోజు ఆ పార్టీలో చేరారు.

త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురం నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురానికి పోటీచేసిన నవీన్ నిశ్చల్ కి ఈ ఏడాది టికెట్ ఇవ్వనని ఇప్పటికే జగన్ తేల్చి చెప్పేసారట. దీంతో.. ఆయన ఓవైపు బోరును ఏడుస్తున్నాడు. అతని టికెట్ ని అబ్దుల్ ఘనీకి ఇచ్చి.. పోటీలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. 

                               

click me!