
కడప : పెళ్లై ఎనిమిది నెలలు అయింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు. పెళ్లయిన కొద్ది రోజుల వరకు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పెళ్ళికి కట్నకానుకల కింద రూ. 45 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజుల నుంచి extra dowry తీసుకుని రావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. husbandతోపాటు అత్తమామలు వేధిస్తుండడంతో భరించలేక ఓ married woman బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చింతకొమ్మదిన్నె మండలంలోని బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై మంజునాథ రెడ్డి వివరాల మేరకు.. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరుకు చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి కుమార్తె గుగ్గుళ్ల నవిత (25) ఎంబీఏ వరకు చదువుకుంది.
2021 ఆగస్టులో సికె దిన్నె మండల పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గుగ్గుళ్ల బాబారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. బాబారెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. నవిత ఓ కంపెనీలో పనిచేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్తతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. వేధింపులు తట్టుకోలేక గురువారం నవిత చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడింది. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పుట్టింటివారు ఆస్పత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. సీకే దీన్నే తహసిల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు.. నవిత తండ్రి లక్ష్మీ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
ఇలాంటి ఘటనే మార్చి 16న తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త extra dowry తేవాలని వేధించడంతో ఓ married women కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కాంపెళ్లి మమత (24), రమేష్ లు ప్రేమించుకోగా 2018లో పెద్దలసమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదిన్నరకి పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. కొన్నాళ్లకు harrasement మొదలయ్యాయి. దీంతో మమత సోమవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్రగాయాలయ్యాయి. మొదట జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.
దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు జగిత్యాల వచ్చి పాత బస్టాండ్ ఎదురుగా మధ్యాహ్నం మృతదేహంతో ఆందోళనకు దిగారు. గంటసేపు ఆందోళన చేయగా డి.ఎస్.పి ఆర్ ప్రకాష్, పట్టణ సీఐ కే కిషోర్ వారితో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా మమత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తన కుమార్తె మమత అత్తమామలు రాజవ్వ, లక్ష్మణ్. భర్త రమేష్, బావ మహేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చారని మమత తల్లి నక్క సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.