పథకాల పేరుతో జగన్.. ప్రజల్ని దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు.. గోరంట్ల

By AN Telugu  |  First Published Apr 19, 2021, 11:52 AM IST

రాష్ట్రంలో రాక్షస, రావణ పాలన సాగుతోందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. పథకాల పేర్లుమార్చడం, ఆర్భాటంగా ప్రకటనలివ్వడం తప్ప, ఈ ప్రభుత్వం ప్రజలకు మేలుచేయడం లేదన్నారు. 


రాష్ట్రంలో రాక్షస, రావణ పాలన సాగుతోందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. పథకాల పేర్లుమార్చడం, ఆర్భాటంగా ప్రకటనలివ్వడం తప్ప, ఈ ప్రభుత్వం ప్రజలకు మేలుచేయడం లేదన్నారు. 

జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి పథకాలు, దగా కార్యక్రమాలుగా మారాయని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, ప్రభుత్వం చేస్తున్నచెల్లింపులకు ఎక్కడా పొంతనలేదన్నారు. కళాశాల, హాస్టల్, ట్యూషన్ ఫీజులు ప్రభుత్వం నిలిపివేయడంతో వేలాదివిద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురుచదువుకునేవారుంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాయం చేస్తానంటున్నాడు. మరి మిగతావారి పరిస్థితి ఏంటి.. అని ప్రశ్నించారు. ద్విచక్ర, నాలుగుచక్రాల బండ్లున్నాయని, విద్యుత్ వాడకంపెరిగిందని విద్యార్థుల ఫీజులు ఆపుతారా? ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. 

విద్యార్థుల భవిష్యత్ కోసం బాధ్యతాయుతంగా పనిచేయకుండా గతప్రభుత్వంపై నిందలేస్తున్నారన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు అందకుండా ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. 

జగన్మోహన్ రెడ్డి తండ్రి  అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన దానికంటే, ఇప్పుడు ఎక్కువగా దోచేస్తున్నాడని విమర్శించారు. నీరు, మట్టి, ఇసుక, ఖనిజాలు సహా మద్యాన్నికూడా తన అధాయవనరుగా మార్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలే లక్ష్యంగా తనజేబు నింపుకునే పనిని జగన్ నిరాటంకంగా కొనసాగిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

click me!