
మంగళగిరి : మంగళగిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహిత పెళ్లయిన 5 నెలలకే ఉరి వేసుకుని suicide చేసుకుంది. ఆ వివాహిత పేరు సమంతగా తెలుస్తోంది. mangalagiriకి చెందిన సమంత.. తణుకుకు చెందిన రాజు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం కావడంతో కొత్త పెళ్లి కూతురైన సమంత పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమయిందో ఏమో తెలియదు కానీ సమంత ఆత్మహత్య చేసుకుంది.
అయితే, నిన్న ఫోన్లో భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి ఉరిపోసుకుని ఆత్మ హత్య చేసుకుందని తెలుస్తోంది.
బెదిరిపోయి జలాశయంలోకి దూకిన ఆవుల మంద, 400 గోవులను కాపాడిన మత్స్యాకారులు.. 50 గల్లంతు..
ఇదిలా ఉండగా, మార్చిలో ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో వెలుగులోకి వచ్చింది. తన భర్త స్నేహితుడి వేధింపులు భరించలేక దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మౌనిక (24) అనే వివాహిత ఈ మార్చి 5న పురుగుల మందు తాగింది. వెంటనే, ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ ఐ సాంబమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అత్త, భర్త, తల్లి కలిసి ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా మౌనిక పురుగుమందు తాగి.. వాంతులు చేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆమె భర్త స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన మోట పలుకుల ప్రశాంత్ (28) ఫోన్లో మానసికంగా వేధిస్తుండటంతో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనస్థాపంతో పురుగులమందు తాగిందన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది అన్నారు. మౌనికకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతురాలి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు కాగా, స్నేహితుడి భార్యను వేధించడం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో.. అవమానంగా భావించిన మోటపల్కుల ప్రశాంత్ (28) సోమవారం రామగుండం దగ్గర దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రశాంత్ కు ఏడాది పాప ఉంది.