ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు: కృష్ణా జిల్లాలో వివాహిత సూసైడ్

By narsimha lode  |  First Published Jul 12, 2022, 9:27 AM IST

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు భరించలేక ప్రత్యూష అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తల్లిదండ్రులకు, భర్తకు సెల్పీ వీడియోను పంపింది. రూ. 20 వేలు తీసుకున్న రుణానికి రూ. 2 లక్షలు చెల్లించినా కూడా వేధింపులు ఆగలేదని ఆమె చెప్పారు.ఈ విషయమై మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆమె చెప్పారు.


ఆవనిగడ్డ: Online లోన్ యాప్ వేధింపులు భరించలేక Prathyusha అనే వివాహిత సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది. Suicideకు  పాల్పడే ముందు  Selfie వీడియో తీసుకుంది. ఆన్ లైన్  Loan APP లలో రూ. 20 వేలు అప్పు తీసుకున్న వివాహిత ప్రత్యూష  రూ. 2 లక్షలు వసూలు చేసింది.ఇంకా వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ విషయాన్ని సెల్పీ వీడియోలో వివరించింది. 

ఆన్ లైన్ లో రుణాలు ఇచ్చే  ఇండియన్ బుల్స్,  రూపెక్స్ యాప్ ల ద్వారా ప్రత్యూష రూ. 20 వేలు రుణం తీసుకుంది. ఈ లోన్ కు సంబంధించి రూ  2లక్షలు చెల్లించినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ లోన్ ను చెల్లించినా కూడా ఇంకా డబ్బులు చెల్లించాలని ఆన్ లైన్  లోన్ యాప్ వేధింపులు తీవ్రమయ్యాయి. డబ్బులు చెల్లించాలని వివాహిత సెల్ ఫోన్ కు అసభ్యంగా మేసేజ్  లు పెట్టారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అంతేకాదు సోమవారం నాడు చివరి రోజుగా ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు డెడ్ లైన్ విధించారు. డెడ్ లైన్ లోపుగా డబ్బులు చెల్లించకపోతే ప్రత్యూష ఫోటోను  న్యూడ్ ఫోటోగా మార్పింగ్ చేసి ఆమె కాంటాక్ట్స్ లో ఉన్న వారందరికీ షేర్ చేస్తామని యాప్ నిర్వాహకులు బెదిరించారు,  దీంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆన్ లైన్ లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న విషయంతో పాటు వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆత్మహత్య చేసుకొనే ముందు ఆమె తన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాారు. ఈ వీడియోను భర్తతో పాటు పేరేంట్స్ కు పంపారు. ఈ వీడియో చూసి అప్రమత్తమైన  కుటుంబ సభ్యులు ప్రత్యూష వద్దకు చేరుకొనేసరికి ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Latest Videos

ఈ విషయమై తనకు ఆమె ఎప్పుడూ సమాచారం ఇవ్వలేదని ప్రత్యూష భర్త చెప్పారు. ఈ విషయమై మంగళగరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా  ప్రత్యూష భర్త తెలిపారు. ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులతో మరొకరి ప్రాణం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యూష తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరుతున్నారు. రాష్ట్రంలో ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని  వారు ప్రశ్నించారు. ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సీఎంను కోరారు. 
 

click me!