పెళ్లైన మూడు రోజులకే.. ప్రేమికుడితో వివాహిత జంప్.. ఇంటికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత..

Published : Jun 13, 2022, 09:47 AM IST
పెళ్లైన  మూడు రోజులకే.. ప్రేమికుడితో వివాహిత జంప్.. ఇంటికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత..

సారాంశం

పెద్దల చెప్పినట్టు విని ప్రేమించినవాడిని కాదని... పెళ్లి చేసుకుంది. ఆ తరువాతే మనసు మారింది. అంతే పెళ్లైన మూడో రోజూ ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో అత్తింటివారు ఆగ్రహంతో ఆ ప్రేమికుడి ఇంటికి నిప్పుపెట్టారు. 

కర్నూలు :  ఇష్టం లేని పెళ్లితో ఎన్నో అనర్థాలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి ఒప్పించడంతో.. కాబోయే భర్తను గొంతుకోసిన అనకాపల్లి ఘటన షాక్ కు గురి చేయగా.. ఆ తరువాత ఇలాంటి ఘటనలు అక్కడక్కడా కనిపించాయి. తాజాగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువతి.. పెళ్లైన మూడు రోజులకే ప్రియుడితో పారిపోయింది. 

పెళ్లి అయిన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో వివాహిత వెళ్లిపోవడం వివాదానికి దారి తీసింది. ఆగ్రహించిన కుటుంబీకులు యువతి ప్రేమికుడు ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.  మాధవరం గ్రామానికి చెందిన యువతిని ఈనెల 9న సమీపంలోని గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసారు. అయితే అంతకు ముందే ఆమె మాధవరానికి చెందిన  శివాజీని ప్రేమించింది.  

పెళ్లైన మూడో రోజున  శివాజీ ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది తెలుసుకున్న వధూవరుల బంధువులు ఆదివారం రాత్రి శివాజీ ఇంటికి నిప్పు పెట్టారు. అందులో దుస్తులు, బియ్యం. కాలిపోయాయి.ఎస్ ఐ  రాజకుళ్లాయప్ప సిబ్బందితో వెళ్లి చుట్టుపక్కల వారితో కలిసి మంటలను ఆర్పి వేశారు. ఆ సమయానికి శివాజీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 

రైలు భోగీలో గుర్తు తెలియని మృతదేహం.. తిరుపతిలో కలకలం..

ఇదిలా ఉండగా, బెంగళూరులో సుంకదకట్టెలో యువతిపై Acid attack ఘటన మరువక ముందే… అలాంటి  ఘోరం మరొకటి నగరంలో పునరావృతం అయింది. పెళ్లికి నిరాకరించిందని ఓ Marriedపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. డిసిపి హరీష్ పాండే కథనం మేరకు యాసిడ్ దాడికి గురైన మహిళ కుమారస్వామి లే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  Karnataka అగరబత్తి పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమెకు వివాహం అయి, ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది.

ఇదే పరిశ్రమలో పని చేస్తు భార్యకు దూరంగా ఉన్న అహ్మాద్ కు, మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. వివాహం చేసుకుందామని కోరగా  తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆమె అంగీకరించలేదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య  గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ  విధులకు వెళ్తుండగా సారక్కి  వద్ద అహ్మద్ గొడవపడి యాసిడ్ చల్లి ఉడాయించాడు.  కుమారస్వామి లే అవుట్ పోలీసులు బాధితురాలిని వాసన్ ఐకేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కుమారస్వామి లేఔట్ పోలీసులు అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్