రైలు భోగీలో గుర్తు తెలియని మృతదేహం.. తిరుపతిలో కలకలం..

By SumaBala Bukka  |  First Published Jun 13, 2022, 7:09 AM IST

తిరుపతిలో ఓ రైలులో గుర్తుతెలియని మృతదేహం లభించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వచ్చిన రైలు భోగీలో ఇది లభించింది. 


తిరుపతి : Tirupati Railway Stationలో ఆగి ఉన్న రైలు పెట్టెలో dead body లభ్యమయ్యింది. ఆదివారం రోజు ఉదయం శ్రీకాకుళం నుంచి తిరుపతికి చేరిన రైలులోని బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.  తిరుపతి రైల్వే స్టేషన్ అధికారుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయసు 45-50 సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంటు వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న సాధారణ బోగీని శుబ్రం చేయడానికి వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని తిరుపతిలోని Rua Hospitalకి తరలించారు. 

Latest Videos

undefined

మచిలీపట్టణంలో విషాదం: పబ్జీ గేమ్‌లో ఓటమితో సూసైడ్ చేసుకున్న యువకుడు

ఇదిలా ఉండగా, ఆదివారంనాడు విజయవాడ రైల్వేస్టేషన్‌లో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కు గురయ్యింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బాలికను షేక్‌ షఫీదాగా, తల్లిదండ్రులు రైల్వే స్టేషన్‌లో చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుని జీవనం సాగిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

వివరాల్లోకి వెళితే.. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఆడుకుంటున్న చిన్నారి వద్దకు గుర్తు తెలియని మహిళ వచ్చింది. పాపకు చాక్లెట్లు ఇప్పించి.. ఆ తరువాత బాలికను అపహరించుకుపోయింది. ఆ సమయంలో చిన్నారి తల్లి నిద్రిపోతుండగా.. తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే పాప కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన తల్లి వెంటనే రైల్వై స్టేషన్ లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అనంతరం పాపను ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించేందుకు రైల్వే స్టేషన్‌ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. షఫీదాను రైల్వేస్టేషన్ బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నెహ్రూ బొమ్మ సెంటర్ ఏరియాలో కొండపైకి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో చిట్టినగర్, పంజా సెంటర్, వాగు సెంటర్, డెయిరీ ఫ్యాక్టరీ సితార సెంటర్ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీని నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు పంపించి ఆరా తీస్తున్నారు. 
 

click me!