దారుణం : పొలానికి వెళ్లిన మహిళను తొక్కి చంపిన ఏనుగులు...!

Published : May 06, 2021, 10:32 AM IST
దారుణం : పొలానికి వెళ్లిన మహిళను తొక్కి చంపిన ఏనుగులు...!

సారాంశం

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం లోని పాత కలికోట లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం లోని పాత కలికోట లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 

పొలం పనులు చేసుకుంటున్న వారిపై దాడికి దిగడంతో ఓ మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు భయాందోళనల్లో ఉన్నారు. 

అయితే ఏనుగుల దాడిలో చాలా మంది చనిపోతున్నారని ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

మృతురాలు కలికోట గ్రామానికి చెందిన అల్లాడ అప్పమ్మ 50 సంవత్సరాలు. తెల్లవారుజామున తమ పొలానికి కూరగాయలు ఏరడానికి వెళ్లినప్పుడు ఏనుగుడు ఆమె మీద దాడి చేశాయి. 

మృతురాలిని ఆమె బంధువులు  పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించినున్నారు.
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu