తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం ... మహిళా భక్తురాలు దుర్మరణం

Published : Jan 12, 2024, 12:45 PM IST
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం ... మహిళా భక్తురాలు దుర్మరణం

సారాంశం

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదం బారినపడి మహిళా భక్తురాలు దుర్మరణం చెందింది. 

తిరుపతి : తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జ్యోతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లింది. బైక్ పై తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బైక్ ఓ మలుపు వద్ద అదుపుతప్పి బస్సును ఢీకొంది. దీంతో తీవ్రంగా జ్యోతి తీవ్రంగా గాయపడింది. ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. 

జ్యోతి మృతితో మాచర్లలోని ఎర్రగడ్డ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన ఆమె మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్