విజయవాడలో దారుణం... ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Aug 22, 2021, 10:02 AM ISTUpdated : Aug 22, 2021, 11:08 AM IST
విజయవాడలో దారుణం... ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

సారాంశం

ఏడాది క్రితమే కరోనా భర్త చనిపోగా తాజాగా ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: ఏడాది క్రితం కరోనా మహమ్మారి భర్తను బలితీసుకుంది. ఇలా భర్తను కోల్పోయి పుట్టెడు ధు:ఖంలో ఆమెపై అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జీవితంపై విరక్తిచెందిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం విజయవాడలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని ప్రసాదంపాడులో నివాసముండే మహిళ ఇద్దరు పిల్లలతో  కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కరోనాతో భర్తను కోల్పోయిన కోడలికి తోడుగా ఉండాల్సిన అత్తింటివారు  వేధింపులకు గురి చేయడంతోనే పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మృతురాలి పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.  

read more శాడిస్ట్ లవర్... ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో

ఆత్మహత్యల గురించి సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?