అన్నకు రాఖీ కట్టలేకపోయానని... చెల్లి ఆత్మహత్య..!

Published : Aug 27, 2021, 09:02 AM IST
అన్నకు రాఖీ కట్టలేకపోయానని... చెల్లి ఆత్మహత్య..!

సారాంశం

రాఖీ కట్టడానికి ఆమె ప్రతి సంవత్సరం తన అన్నయ్యను ఇంటికి పలిచేది. అయితే.. అతను వచ్చేవాడు కాదు.. ఈ రాఖీ పౌర్ణమికి కూడా ఆమె తన సోదరుడిని ఇంటికి పిలిచింది.

తన సోదరుడికి రాఖీ పండగ రోజున రాఖీ కట్టలేకపోయాననే బాధతో ఓ చెల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విజయవాడ సమీపంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడ లోని వైఎస్సార్ కాలనీలో నివసించే అమలాపురపు స్వాతి(32) కి దుర్గా ప్రసాద్ తో 18 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఆమె సోదరుడు దేవీ నగర్ లో ఉంటున్నాడు. అయితే స్వాతి భర్త దుర్గా ప్రసాద్ కీ, ఆమె సోదరుడికి  ఏడు సంవత్సరాలుగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో.. వారు మాట్లాడుకోవడం లేదు.

అయితే.. రాఖీ కట్టడానికి ఆమె ప్రతి సంవత్సరం తన అన్నయ్యను ఇంటికి పలిచేది. అయితే.. అతను వచ్చేవాడు కాదు.. ఈ రాఖీ పౌర్ణమికి కూడా ఆమె తన సోదరుడిని ఇంటికి పిలిచింది. అతను రాకపోవడంోత మనస్థాపానికి గురైంది. ఇక తన అన్నయ్య తనని చూడటానికి కూడా రాడు అని భావించిన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అయితే..  చాలా సంవత్సరాలుగా తన చెల్లి పిలుస్తున్నా రాలేకపోయానని.. ఈసారి వెళ్లాలని ఆమె సోదరుడు భావించి ఇంటికి వచ్చే సరికి ఆమె చనిపోయి  కనిపించడం గమనార్హం.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?