
తమ్ముడి భార్యపై కన్ను వేశాడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని.. మరదలిని తాను దక్కించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో.. మరదలిని తన కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో... బావగారి వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తాడేపల్లికి చెందిన శ్రీనివాసరావుకి 12 సంవత్సరాల క్రితం గీతా సురేఖ తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా.. శ్రీనివాసరావు ఫోటోగ్రాఫర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. శ్రీనివాసరావు చాలా అమాయకుడు కావడంతో.. అతని సోదరుడు శివశంకర్ దానిని ఆసరాగా తీసుకున్నాడు.
ఈ క్రమంలో తమ్ముడు భార్య గీతా సురేఖ పై కన్నువేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిజేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాసురేఖ జనవరి 15 వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. అదే రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ తన సోదరి ఇంటికి వెళ్లగా.. అసలు విషయం తెలిసింది.
వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శివశంకర్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.