బెదిరింపులు: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టు (వీడియో)

By telugu team  |  First Published Feb 2, 2021, 8:39 AM IST

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారనే ఆరోపణలు రావడంతో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.


శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి స్టేషన్ కు తరలించారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడనే ఆరోపణపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

దాంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మాడ అచ్చెన్నాయుడి స్వగ్రామం. దాంతో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని అచ్చెన్నాయుడు భావించారు. అయితే, వైసీపీ మద్దతుదారుడు నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చాడు. దీంతో ఆయనను అచ్చెన్నాయుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్, అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Latest Videos

undefined

అచ్చెన్నాయుడి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సోమవారం వైసీపీ నేతలు ఎన్నిక సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేయాలని వారు డిమాడ్ చేశారు.

తాను ఎవరినీ బెదిరించలేదని అచ్చెన్నాయుడు అంటున్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేనిన తర్వాత భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి దశలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ రోజు రెండో విడతలో నామినేషన్ల పర్వం మొదలవుతుంది.

"

click me!