పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద గోదావరి వరద ఉధృతికి రివర్ బండ్ కోతకు గురౌతుంది. దీంతో స్థానికలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నది సముద్రంలో కలవడానికి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
ఏలూరు:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద Godavari వరద ఉధృతికి రివర్ బండ్ కోతకు గురౌతుంది. దీంతో River Bund పై ఉన్న విగ్రహాలు గోదావరిలో కొట్టుకుపోతున్నాయి.
Narasapuram లోని రివర్ బండ్ పై ఉన్న కోపనాతి కృష్ణమ్మ విగ్రహం గోదావరి వరదలో కొట్టుకుపోయింది. అంతర్వేది దేవాలయం ట్రస్ట్ మెంబర్ కోపనాతి కృష్ణమ్మ.
undefined
గోదావరి నదికి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నదికి ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద మాత్రం గోదావరి వరద ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది. గోదావరి నది అత్యంత వేగంగా దూసుకు వస్తుంది.
గోదావరి పుష్కరాల సమయంలో నరసాపురంలో పుట్ పాత్ ను నిర్మించారు. అయితే గోదావరి వరద ఉధృతికి ఆదివారం నాడు రాత్రి ఈ పుట్ పాత్ పూర్తిగా కూలిపోయింది. గోదావరి వరద ఉధృతిగా ఉండడంతో ఒడ్డు ప్రాంతం కోతంకు గురౌతుందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు పెద్ద పెద్ద చెట్లను నరికి ఒడ్డు కోతకు గురికాకుండా అడ్డు వేస్తున్నారు.
ఎగువ నుండి 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఈ ప్రాంతం సముద్రంలో కలవడానికి అతి దగ్గరగా ఉంటుంది. దీంతో గోదావరికి వరద ఉధృతి పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
1986లో వచ్చిన వరదల కంటే భారీగా వరద వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నర్సాపురం వద్ద గట్టు తెగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికలు అభిప్రాయపడుతున్నారు.