జగన్‌ సర్కార్‌కి షాక్: పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీ కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Oct 29, 2020, 11:48 AM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం నాడు ఆదేశించింది.

అమరావతి:  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం నాడు ఆదేశించింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో  భాగంగా పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త జి. శ్రీనివాస్  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

ఈ విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలను ఇచ్చింది. పోతిరెడ్డిపాడుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ తేల్చి చెప్పింది. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్జీటీ ఆదేశించింది.

తమ వాటా మేరకు నీటిని వాడుకొనేందుకుగాను తాము ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్జీటీ దృష్టికి తీసుకువచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అభిప్రాయం తెలపాలని ఈ ఏడాది ఆగష్టు 11న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్రాన్ని కోరింది.

click me!