విశాఖ ఏజెన్సీలో చేతబడి అనుమానం.. రెండు కుటుంబాల పరస్పర దాడుల్లో ముగ్గురు మృతి...

By AN Telugu  |  First Published Dec 2, 2021, 11:30 AM IST

గొల్లోరి డుంబు, అతని కుటుంబ సభ్యులు కిల్లో కోమటి కుటుంబసభ్యులపై చేతబడి చేస్తున్నారంటూ కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కిల్లో కోమటి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కుమారులు బలరాం, భగవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.


విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ పరిధిలోని బాగ్‌మరవలస గ్రామంలో witchcraftల అనుమానంతో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెడితే.. 

గొల్లోరి డుంబు, అతని కుటుంబ సభ్యులు కిల్లో కోమటి కుటుంబసభ్యులపై చేతబడి చేస్తున్నారంటూ కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో attack చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కిల్లో కోమటి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కుమారులు బలరాం, భగవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

Latest Videos

undefined

దీనికి ప్రతీకారంగా కిల్లో కోమటి బంధువులు గొల్లూరి డుంబి, అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనతో గ్రామ శివారులో డుంబు, గ్రామంలో అతని కుమారుడు సుబ్బారావులు శవాలుగా తేలారు. 

చేతబడి చేస్తున్నారంటూ కోమటి కుటుంబంపై దాడి చేయడంతో దుంబు కుటుంబంపై గ్రామస్తులు దాడి చేశారు. Old factions ఘర్షణలకు ప్రధాన కారణమని స్థానిక వర్గాలు తెలిపాయి. అనంతగిరి, అరకు పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు క్షతగాత్రులను కింగ్ జార్జ్ ఆసుపత్రికి, స్వల్ప గాయాలతో ఉన్న మరికొందరిని ఎస్ కోట ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లాలో రెండు రోజుల క్రితం ఇలాంటి దారుణమే జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమన్నాడని ఓ వృద్ధుడిపే కసి పెంచుకుని దారుణంగా murder చేశాడో వ్యక్తి. దీనికి అప్పటికే ఆ వృద్ధుడు Witchcraft చేశాడని ఆయనపై కక్ష పెంచుకున్న మరొకరు తోడయ్యారు. ఈ నెల 25న అర్థరాత్రి ఏర్పేడు మండలం పంగూరు గిరిజన కాలనీకి చెందిక కుంభ నారాయణ (59)ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి police ఆరుగురు నిందితులను arrest చేశారు. 

వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని పంగూరు గిరిజన కాలనీకి చెందిన నారాయణ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇంటిపక్కనే నివసిస్తున్న వరుసకు మేనల్లుడైన పూజారి నాగరాజు (56) తరచూ healt problemsకి గురవుతున్నాడు. కుటుంబంలో Financial difficulties మొదలయ్యాయి. నారాయణ చేతబడి చేయడంతో సమస్యలు వస్తున్నట్లు అనుమానించారు. ఈ విషయమై తరచూ రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుండేది. 

అప్పు తీసుకుని ఒకరు, చేతబడి పేరుతో మరొకరు... వృద్ధుడి గొంతుకోసి దారుణంగా చంపేశారు..

ఈ నెల 20న స్థానిక కుల పెద్దలు నాగరాజు కుటుంబంపై చేతబడి చేయలేదని బుచ్చినాయుడు కండ్రిగ మండలం పచ్చాలమ్మ కాలనీలోని పచ్చాలమ్మ ఆలయంలో నారాయణ oath చేయాలని తీర్మానించారు.  దీంతో వచ్చే నెల 6న ప్రమాణం చేసేందుకు సిద్ధమని నారాయణ తేల్చి చెప్పాడు.

పంగూరు  గిరిజన కాలనీకి చెందిన మస్తానయ్య కుమారుడు పూజారి వెంకటేష్ ఈ ఏడాది ఆరంభంలో  తన చెల్లి పెళ్లి నిమిత్తం  నారాయణ వద్ద రూ. యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు.  మూడు నెలలు తర్వాత సొమ్ము అడిగిన నారాయణతో వెంకటేష్ గొడవకు దిగాడు.  ఆ తర్వాత నాగరాజు వద్ద రూ. 50 వేలు తీసుకుని అప్పు చెల్లించాడు. అయితే అప్పు చెల్లించమని  నలుగురి ఎదుట  ఒత్తిడి పెట్టిన  నారాయణపై  కసి పెంచుకున్నాడు. 

ఆ తర్వాత  నాగరాజు తో చేతులు కలిపి  నారాయణని చంపాలని  పథకం పన్నాడు. ఈ మేరకు.. ఈ నెల 25న అర్ధరాత్రి దాటాక నారాయణ గొంతు కోసి దారుణంగా చంపేశారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

click me!