త్వరలో ‘ఓటుకునోటు’ విచారణ ?..చంద్రబాబుకు షాక్

First Published Mar 12, 2018, 3:36 PM IST
Highlights
  • ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ఎన్నికల ముందు చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగలనుందా? ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. త్వరలో ఓటుకునోటు కేసులో చనలం రానున్నట్లు సమాచారం. ఎందుకంటే, రాజకీయ నేతలపై ఉన్న అన్నీ కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలంటూ సుప్రింకోర్టు గతంలోనే ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే.

దేశం మొత్తం మీద సుమారు 1750 రాజకీయ నేతలపై సుమారు 3 వేల  కేసులున్నాయి. అందులో క్రిమినల్ కేసులు కూడా బోలెడున్నాయి. వాటిని వెంటనే విచారించి శిక్షలు వేయటానికే సుప్రింకోర్టు ప్రత్యేకకోర్టులు ఏర్పాటు చేసింది. 3 వేల కేసుల్లో ఏపిలోని నేతలపై సుమారు 100 కేసులున్నాయి. అందులో చంద్రబాబుపై ఉన్న ఓటుకునోటు కేసు చాలా ప్రముఖమైనది.

మొన్న ఫిబ్రవరిలోనే విజయవాడలో ప్రత్యేకకోర్టు ఏర్పాటైంది. అంటే త్వరలోనే నేతలపై  వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ ఈ ప్రత్యేకకోర్టులకు తరలిస్తారు. అన్నీ కేసుల బదిలీ పూర్తి కాగానే విచారణ మొదలవుతుంది. అందులో చంద్రబాబు ఓటుకునోటు కేసు కూడా తప్పకుండా ఉంటుందనటంలో సందేహం లేదు.

 

ఒకవేళ ప్రత్యేకకోర్టు విచారణ మొదలుపెట్టటమే ఓటుకునోటు కేసుతో మొదలుపెడితే ఏమవుతుందో అని టిడిపి వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఏదేమైనా ఇంతకాలంగా మరుగున పడి ఉన్న ఓటుకునోటు కేసుకు కదలిక వచ్చేలాగుంది.

click me!