కొడుకుకు తండ్రి మీద ద్వేషం పుట్టించి, హత్యకు సహకరించేలా చేసి.. భర్తను చంపించిన భార్య..

Published : Jul 15, 2022, 07:26 AM IST
కొడుకుకు తండ్రి మీద ద్వేషం పుట్టించి, హత్యకు సహకరించేలా చేసి.. భర్తను చంపించిన భార్య..

సారాంశం

విజయనగరం హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించిన భార్య ఆ పథకంలో కన్నకొడుకునూ భాగస్వామిని చేసింది. 

గంట్యాడ : extramarital affair ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రెండు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. జీవితాంతం తోడుగా నిలవాల్సిన భార్య తన భర్తను murder చేయించింది. దీనికోసం కుమారుడిని మభ్యపెట్టి కన్న తండ్రినే చంపించింది. ఈ విషాదకర సంఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు నిందితులు. చివరకు అడ్డంగా దొరికిపోయారు.  24 గంటల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులు..  గురువారం వారిని అరెస్టు చేశారు. అయితే మొదట ప్రియుడితో కలిసి చంపించింది అని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఆ పథకంలో కన్నకొడుకు కూడా ఉన్నాడని తెలిసి అందరూ షాకయ్యారు. ఈ వివరాలను డీఎస్పీ టి త్రినాథ్ గురువారం వెల్లడించారు.

గంట్యాడ  మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన  సింగంపల్లి రాము(42) ఈనెల 11న  కొటారుబిల్లిలో లక్ష్మీ సాగరం చెరువు సమీపంలో శవమై కనిపించాడు. రోడ్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అతని భార్య తులసి చెప్పింది. అయితే అతని సోదరుడు కృష్ణకి అనుమానం వచ్చి.. హత్యకు గురయ్యాడని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డిఎస్పి ఆధ్వర్యంలో సీఐ సత్య మంగవేణి, ఎస్సై గణేష్ విచారణ చేపట్టారు. వీరి విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య గుట్టు రట్టయింది. తులసికి మూడేళ్లుగా సాలూరు మండలం శంబరకు చెందిన బి సన్యాసినాయుడు వివాహేతర సంబంధం ఉంది.

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. ఓ భార్య ఘాతుకం...

 ఈ విషయం మీద భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన ఆనందానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆమె భర్తను చంపించాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఈ పథకంలో భాగంగా తన కుమారుడికి(15) తండ్రి మీద ద్వేషం కలిగేలా చేసింది. దీంతో అతను తల్లి చెప్పినట్టుగా వినడానికి రెడీ అయిపోయాడు. అలా ఈ నెల 11న రాత్రి 9 గంటలకు  కడుపునొప్పి వచ్చినట్లు నటించాడు. దీంతో కొడుకును తీసుకుని రాము టూ వీలర్ మీద విజయనగరం ఆస్పత్రికి బయలుదేరాడు. కొటారుబిల్లి చెరువు వద్దకు వచ్చేసరికి బహిర్భూమికి వెళ్లాలని తండ్రిని నమ్మించాడు.

అప్పటికి అక్కడ కాపుకాసిన తల్లి ప్రియుడు... తండ్రి తల మీద కర్రలతో దాడి చేసి, చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.  అయితే అప్పటికి వాహనాలు తిరుగుతుండడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు చేదించిన  సిఐ,  ఎస్సై, కానిస్టేబుల్  షఫీని అభినందించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?