
తగరపువలస : ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ కొత్త కల్లివానిపాలెంలో మంగళవారం అర్ధరాత్రి auto driver పిల్లి పైడిరాజు (38) దారుణ murder జరిగింది. ఈ కేసును ఆనందపురం పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆనందపురం సీఐ వై.రవి గురువారం ఈ కేసుకు సంబంధించి విలేకరులకు ఇచ్చిన సమాచారం మేరకు.. అతని wife, ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న అప్పలకొండమ్మ (33), తమ్ముడు కొల్లి శ్రీనివాస్ (23) సహాయంతో హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
ఇందుకోసం కొత్త పరదేశిపాలెం, భీమిలి రెల్లివీధి, కృష్ణ కాలనీలకు చెందిన కిరాయి హంతకులు బోర ఆది బాబు (27), పల్లా దుర్గయ్య (20), బంగారి గణేష్ (30), వలసల అప్పలరాజు (31)లతో రూ. 2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడయింది. ఆమెకు పైడిరాజు ఉరఫ్ పైడిరెడ్డితో 15 ఏళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు.. కుమార్తె రోహిణి ఇంటర్, కుమారుడు శ్రవణ్ పదవ తరగతి చదువుతున్నాడు.
మద్యం, గంజాయికి బానిసైన పైడిరాజు భార్యను తరచుగా శారీరకంగా, మానసికంగా క్రూరంగా హింసించేవాడు. మోకాళ్లపై నిలబెట్టి పైశాచికానందం పొందేవాడు, దీంతోపాటు గంజాయి పీల్చే స్నేహితులను ఇంటికి తెచ్చి అర్ధరాత్రులు వారికి సపర్యలు చేయమని బలవంత పెట్టేవాడు. ఇలాంటివాటితో సరిపెట్టుకోకుండా.. తీవ్రంగా కొట్టేవాడు. ఊర్లో అందరితో గొడవ పడుతూ... కట్టుకున్న ఇల్లాలికి, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా ప్రవర్తించేవాడు. గంజాయి మత్తులో విచక్షణ మరచి తల్లి, భార్య, బిడ్డలు అన్న తేడా లేకుండా కొట్టేవాడు. దీంతో విసుగుకు చెందిన భార్య కన్నవారింటికి సహాయంతో హత్య చేయించింది.
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. చెట్టంత కొడుకు చనిపోయాడు అనే బాధ లేదా వ్యక్తికి…సరికదా.. భర్తలేని బాధలో ఉన్న daughter in lawని కూతురులా చేసుకోవాల్సింది పోయి ఆమె పై మోజు పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు harassmentకు గురిచేశాడు. మాట వినడం లేదని ఆగ్రహంతో ఆమెపై murder attempt చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వయానా తన సోదరి కూతురిని ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నాడు.
ఆమెను తన కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. అయితే అనారోగ్యంతో ఇటీవల కుమారుడు మృతి చెందాడు. ఇదే అదనుగా మేనమామ కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని కోడలిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ విషయంపై కుటుంబంలో మంగళవారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మామ, కోడలిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి తల్లి అడ్డుగా వెళ్ళింది. దాంతో ఆమెకు రెండు చోట్ల కత్తిపోట్లు తగిలాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.