దోమలపై దండయాత్ర చట్టమేది?

Published : Jun 27, 2017, 08:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
దోమలపై దండయాత్ర చట్టమేది?

సారాంశం

దోమల దెబ్బకు ఒకవైపు జనలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మత్రం ఇంకా దండయాత్ర మొదలుపెట్టేందుకు ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నట్లుంది. గతంలోనే ప్రకటించిన దండయాత్ర బిల్లు, చట్టం ఏమైందో ఎవరికీ అర్ధం కాలేదు. 

గుర్తుందా ఆమధ్య చంద్రబాబునాయుడు దోమలపై దండయాత్ర అంటూ ఒకటే ఊదరగొట్టేసారు. దోమలపై యుద్దమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. సరే ఏదో యుద్ధం చేస్తున్నారు కదా ఏం చేస్తారో? ఎలా చేస్తారో చూద్దామని అందరూ ఎదురుచూసారు. అయితే, నాలుగు రోజుల ఆర్భాటం తర్వాత దోమలపై యుద్చేసేసామని, గెలిచేసామని కూడా ప్రకటించేసుకున్నారు. దోమలపై దండయాత్ర కోసం ఒక బిల్లును కూడా రూపొందించి చట్టం చేస్తామని గొప్పగా ప్రకటించారు చంద్రబాబు. దాంతో ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు.

సరే ఏదో అయిపోయిందనుకుంటే, మళ్ళీ ఇపుడు దోమలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడబట్టినా దోమల కాటుతో అనారోగ్యం బారిన పడిన వారే కనబడుతున్నారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ఏరియాతో పాటు మిగిలిన ప్రాంతంలోని స్లం ప్రాంతాలు, మున్సిపాలిటీలని తేడాలేకుండా దోమలు వాయించేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా కేసులు బాగా నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అయితే, ఆంథ్రాక్స్ కూడా బయటపడినట్లు ప్రభుత్వమే నిర్ధారించింది. ఒక్క విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని ఇప్పటికి సుమారు 2 వేల మలేరియా కేసులను ప్రభుత్వం గుర్తించింది

దోమల దెబ్బకు ఒకవైపు జనలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మత్రం ఇంకా దండయాత్ర మొదలుపెట్టేందుకు ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నట్లుంది. గతంలోనే ప్రకటించిన దండయాత్ర బిల్లు, చట్టం ఏమైందో ఎవరికీ అర్ధం కాలేదు. మొన్న మార్చి 30వ తేదీన బిల్లు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఇంత వరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దోమలపై యుద్దంలో జనాలు ఓడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా?

 

        

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?