అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులను కూడా పట్టించుకోని ప్రభుత్వం ఎందుకని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రశ్నించారు. ఒక్క సారిగా వచ్చిన వర్షాల వల్ల పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువగళం ఈ పాదయాత్ర కర్నూలు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. 85వ రోజుకు చేరుకున్న ఈ పాదయాత్ర దారిలో ఏరైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ అన్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు ఘోరంగా తిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇంతలా పంట నష్టపోయినా రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకృతి కన్నెర్ర జేసింది... ప్రభుత్వ పెద్దలు పత్తాలేరు!
పాదయాత్ర దారిలో ఏరైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు ఘోరంగా దెబ్బతింటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.(1/3) pic.twitter.com/krjUrSyJV1
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘పాదయాత్ర దారిలో కడిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతును పరామర్శించాను. రెండెకరాల మొక్కజొన్న వేస్తే పెట్టుబడి రూ.50వేలు, కౌలు రూ.40వేలు కలిపి రూ.90వేలు పెట్టుబడి అయితే, ఇప్పటిదాకా రూ.9వేలు దిగుబడి వచ్చింది. అకాల వర్షాలకు ఏరువచ్చి పంట కొట్టుకుపోతే పట్టించుకునే నాథుడు లేడు. అన్నదాతల వద్దకు వచ్చి కనీసం స్వాంతన చేకూర్చలేని ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డీ?!’’ అని ఆయన పేర్కొన్నారు.