తెలంగాణ బార్డర్లో ప్రతిసారీ ఈ పంచాయితీ ఏమిటి..?: జగన్ సర్కార్ పై అచ్చెన్న సీరియస్

By Arun Kumar PFirst Published May 23, 2021, 12:04 PM IST
Highlights

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఆంధ్ర-తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద వెహికల్స్ ని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.

గుంటూరు:  కరోనా నేపధ్యంలో ఏపి-తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు అవుతున్నాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఏపీ నుండి తెలంగాణకు వస్తున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ పాస్ తో పాటు ఇతర పత్రాలు వుంటే తప్ప అనుమతివ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఆంధ్ర-తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద వెహికల్స్ ని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. 

దీనిపై ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. తెలంగాణా బార్డర్ లో ప్రతిసారీ పంచాయితీలేమిటి? అని అచ్చెన్న ప్రశ్నించారు. పొందుగుల వద్ద వాహనదారులపై ఆపడమే కాదు లాఠిచార్జి కూడా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

read more  తెలంగాణలోకి నో ఎంట్రీ... ఏపీ వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

''ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా..? రాష్ట్రప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖలా మారింది. తెలంగాణా భారతదేశంలో అంతర్భాగం కాదా? అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా? ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల సిఎంలు చెలగాటమాడుతున్నారు'' అని మండిపడ్డారు.

''కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించండి. మీ మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే చూస్తూ ఊరుకుంటారా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదు. సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించండి. సమస్య ఇలాగే పునరావృతమవుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 


 

click me!