నా మందు ఆయుర్వేదమే: ఆనందయ్య

Published : May 23, 2021, 12:00 PM ISTUpdated : May 23, 2021, 12:06 PM IST
నా మందు ఆయుర్వేదమే: ఆనందయ్య

సారాంశం

 తాను తయారు చేసిన మందు ఆయుర్వేదంగానే పనిచేస్తుందని ఆనందయ్య చెప్పారు. ఆదివారం నాడు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తన మందు విషయంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

నెల్లూరు:  తాను తయారు చేసిన మందు ఆయుర్వేదంగానే పనిచేస్తుందని ఆనందయ్య చెప్పారు. ఆదివారం నాడు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తన మందు విషయంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన మందుపై ఐసీఎంఆర్ తో పాటు ఇతర నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత ప్రజలకు మందు అందిస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు మేలు చేసేందుకే తాను మందును తయారు చేసినట్టుగా ఆయన తెలిపారు. 

also read:నేడు కృష్ణపట్టణానికి ఐసీఎంఆర్ బృందం: మందు తయారీ విధానాన్ని యూట్యూబ్‌లో పోస్టు చేసే యోచన

తనకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని కరోనాకు మందును అందిస్తున్న ఆనందయ్య చెప్పారు. 
 ప్రజలకు మేలు చేసేందుకే తాను మందును తయారు చేసినట్టుగా ఆయన తెలిపారు.  తన అనుచరులకు ఎవరికీ కూడ ఇబ్బందులు లేవన్నారు. తన పేరు చెప్పుకొని దొంగతనంగా మందులు  విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. 

నాలుగు రోజుల క్రితం కోటయ్య అనే వ్యక్తికి మందు వేశానని ఆయన చెప్పారు. నాలుగు రోజుల్లో ఇతరత్రా కారణాలతో ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చు కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. కోటయ్య కొడుకులు కూడ ఈ విషయమై మీడియాకు సరైన రీతిలో సమాధానం ఇచ్చారని ఆనందయ్య చెప్పారు.  కొన్ని మీడియా సంస్థలు ఈ విషయమై తప్పుడు ప్రచారం చేశాయని  ఆయన ఆరోపించారు. ఇదే విషయాన్ని  కోటయ్య కొడుకులు వివరణ ఇచ్చారని  ఆయన గుర్తు చేశారు. వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతోందని ఆనందయ్య చెప్పారు.  సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే