పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

Published : Oct 15, 2019, 01:35 PM ISTUpdated : Oct 15, 2019, 05:23 PM IST
పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకొంది. పాపికొండల టూర్ ను ప్రభుత్వం రద్దు చేయడంతో సహజమైన ప్రకృతి అందాలను తిలకించేందుకు వెళ్తూ పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. 

రాజమండ్రి: గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో  మారేడుమిల్లి టూర్‌కు పర్యాటకులు  వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు మధ్య పర్యాటకులతో వెళ్తే బస్సు మంగళవారం నాడు లోయలో పడింది. హైద్రాబాద్ నుండి పర్యాటకులు బస్సులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లింది.

పర్యాటకులు మంగళవారం నాడు భద్రాచలం ఆలయంలో శ్రీరాముడి సన్నిధిలో పూజలు చేసిన తర్వాత మారేడుమిల్లికి బయలుదేరారు. మారేడుమిల్లి వద్ద  ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రైవేట్ బస్సు లోయలో పడింది.

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పాపికొండలు యాత్రను ప్రభుత్వం నిషేధించడంతో మారేడుమిల్లి టూర్ కు ఎక్కువగా పర్యాటకులు వస్తున్నారని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

మారేడుమిల్లి వద్ద బస్సు లోయలో పడిన విషయం తెలుసుకొన్న వెంటనే స్థానిక ఎస్ఐ శివరామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొన్నారు. బస్సులో చిక్కుకొన్న వారిని బయటకు తీస్తున్నారు.  గాయపడిన వారిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu
Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం | Asianet News Telugu