కాపా ,కమ్మా, రెడ్డా, ఎస్సియా, బిసియా

Published : May 05, 2017, 10:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కాపా ,కమ్మా, రెడ్డా, ఎస్సియా, బిసియా

సారాంశం

ప్రస్తుత ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు(తూర్పు కాపు) మంత్రయ్యాడు కాబట్టి, ఒక మనిషి ఒక పదవి  సూత్రం అప్లయి చేసి, ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని అంతా బలంగా నమ్ముతున్నారు. అందువల్ల కొత్త అధ్యక్షుడి నియమాకం విశాఖ మహానాడులో జరుగుతుందని చెబుతున్నారు. అందుకే అన్ని కులాల  తమ్ముళ్లు ఈ పోస్టు కోసం ఎగబడుతున్నారు.

వచ్చే తెలుగుదేశం అధ్యక్షుడే కులంవాడు?

 

 కాపుయా, కమ్మయేనా, రెడ్డిగారా, ఎస్సీలనుంచి వస్తాడా లేక బిసినేతయా !

 

ఇది టిడిపిలోని అన్ని కులాలలో నలుగుతున్న విషయం. ఎవరి విశ్లేషణలు వారివి. కులాల లెక్కలు, ఓట్ల బలగాలు లెక్కేసుకుంటున్నారు.

 

జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అనే విషయంలో మార్పు ఉండదు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా నారా లోకేశ్ అనే విషయంలో పేచీ ఉండదు.అందుకే చర్చంతా అంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడెవరునేదాని చుట్టూ తిరుగూ ఉంది. 

 

ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు(తూర్పు కాపు) మంత్రయ్యాడు కాబట్టి, ఒక మనిషి ఒక పదవి  సూత్రం అప్లయి చేసి ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని అంతా బలంగా నమ్ముతున్నారు. అందువల్ల కొత్త అధ్యక్షుడి నియమాకం విశాఖ మహానాడులో జరుగుతుందని చెబుతున్నారు. అందుకే అన్ని కులాల  తమ్ముళ్లు ఈ పోస్టు కోసం ఎగబడుతున్నారు.

 

కొ ద్ది రోజుల కిందట వచ్చే టిడిపి అధ్యక్షుడు రెడ్డి అని ప్రచారమయింది. తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ , రెడ్డలో టిడిపి వ్యతిరేక భావం సహజంగానే వస్తున్నది కాబట్టి ఇది పొగొట్టేందుకు(కొంతయిన) రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారమయింది. అందుకే పల్లె రఘనాథరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించారని కూడా చెప్పారు. పల్లె కాకపోతే, కడప జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి అని అన్నారు. 

 

 అయితే, ఇపుడు ఎస్ సి నాయకుడి పేరు వినబడుతూ ఉంది. ఇలా కాకుండా బిసిలకు ఈ పదవి అప్పగిస్తాడని కూడా  బిసి నాయకులు చెప్పుకుంటున్నారు. పార్టీకి బిసి పార్టీ అని పేరుంది,అదిస్థిరపడాలంటే బిసిలకు పదవి అప్పగించాలనేది వారి వాదన. ఈ మధ్యలో కాపులు కూడ ఈ పదవి ఆశిస్తున్నారు. కమిడి కళా వెంకటరావు తూర్పు కాపు కాబట్టి, కాపు ల్లోకి రాడని, రిజర్వేషన్లు హామీ అమలుకాక కాపులు అసంతృప్తి గా ఉన్నందున కాపులకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాపు నాయకులు భావిస్తున్నారు.

 

 పార్టీ లోఉన్న కమ్మవారికి  ఈ కాలిక్యులేషన్లు నచ్చినట్లు లేదు. అందుకే,  ఈ వన్నీ ఉత్తుత్తి చర్చలేనని, అసలు పార్టీలో వచ్చే అధ్యక్ష పదికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిమీద చర్చ జరుగడంలేదని, పార్టీ కి చెందిన కమ్మ నాయకుడొకరు చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu