బొత్సా: ఎందుకు కనిపించటం లేదు ?

First Published Oct 13, 2017, 6:53 AM IST
Highlights
  • వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణకు ఏమైంది?
  • తరచూ మీడియాలోనే లేకపోతే ఏదో ఓ కార్యక్రమంలోనూ కనిపిస్తుండే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత ఈమధ్య పెద్దగా కనిపించటం లేదు.
  • ఆమధ్య నంద్యాల ఉపఎన్నిక జరిగినపుడు ప్రతీ రోజు మీడియా ముందుకు వచ్చేవారు. తర్వాత ఏమైందో తెలీదు.

వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణకు ఏమైంది? తరచూ మీడియాలోనే లేకపోతే ఏదో ఓ కార్యక్రమంలోనూ కనిపిస్తుండే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత ఈమధ్య పెద్దగా కనిపించటం లేదు. ఆమధ్య నంద్యాల ఉపఎన్నిక జరిగినపుడు ప్రతీ రోజు మీడియా ముందుకు వచ్చేవారు. తర్వాత ఏమైందో తెలీదు.

పార్టీ వర్గాల సమాచారమైతే పార్టీలో బొత్సాకు ప్రధాన్యత తగ్గిందంటున్నారు. ఎందుకంటే, బొత్స డామినేషన్ నేచరున్న వ్యక్తి. తానెక్కడుంటే అక్కడంతా తన కంట్రోల్లోనే ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా, వియనగరం జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మొత్తం ఉత్తరాంధ్ర అంతా తన కంట్రోల్లోనే ఉండాలని కోరుకున్నారట.  అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదట. చీపురుపల్లి నియోజకవర్గానికి మహా అయితే జిల్లా వరకే పరిమితమవ్వమని స్పష్టంగా చెప్పారట.

బొత్సా డామినేషన్ ను ఉత్తరాంధ్రకే చెందిన శ్రీకాకుళం జిల్లా నేత ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాధ్ తదితరులెవరూ అంగీకరించలేదట. దాంతో డిఫెన్స్ లో పడిపోయిన బొత్సాకు సఫకేషన్ మొదలైందట.  దానికితోడు చంద్రబాబునాయుడుపైన ఇంతకాలం ఏవైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలు బొత్సాపైనా ఉన్నాయి. దాంతో తన వాదనను ధాటిగా వినిపించలేకపోతున్నారనే అభిప్రాయం కూడా వైసీపీ నేతల్లో ఉంది.

ఇటువంటి అనేక కారణాల వల్ల ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ అటు ఉత్తరాంధ్రలోనూ ఒకేసారి బొత్సకు ప్రాధాన్యత తగ్గిపోయిందని సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంతో పాటు రాష్ట్ర విభజన సమయంలో ఓ బొత్సా ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది ప్రస్తుతం సమకాలీకులు, జూనియర్లతో సమానంగా పార్టీలో పనిచేయాలంటే బొత్సాకు కష్టమే. మారిన పరిస్ధితిల్లో ఏం చేస్తారో చూడాలి మరి.

click me!