పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌పై ఏం చర్యలు తీసుకొన్నారు:సీబీఐని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Mar 21, 2022, 9:16 PM IST

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ అరెస్ట్ పై ఏం చర్యలు తీసుకొన్నారని సీబీఐని ఏపీ హైకోరటు ప్రశ్నించింది. 


అమరావతి: సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన Punch Prabakhar అరెస్ట్ చేసేందుకు ఏం చర్యలు తీసకున్నారని ఏపీ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది.

Judgesలపై Social media లో అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై సోమవారం నాడుAP High Court లో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో ఏపీ హైకోర్డు ధర్మాసనం పంచ్ ప్రభాకర్ అరెస్ట్  గురించి ప్రశ్నించింది.  పంచ్ ప్రభాకర్ వీడియోలను నిలుపుదల చేయించామని CBI తరపు న్యాయవాది ఏపీ హైకోర్టు ధర్మాసనానికి తెలిపింది. 

Latest Videos

పంచ్ ప్రభాకర్ అరెస్ట్ అంశంపై కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసినట్టుగా  సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయమై అనుమతులు రావాల్సి ఉందన్నారు. అయితే ఈ అనుమతులు రాగానే పంచ్ ప్రభాకర్  అరెస్ట్ పై చర్యలు తీసుకొంటామని సీబీఐ తెలిపింది. అయితే కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖల నుండి అనుమతి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలను వెంటనే బ్లాక్ చేయాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

జడ్జిలపై అనుచిత పోస్ట్‌లు పలువురిపై చార్జీషీటు దాఖలు చేసినట్టుగా సీబీఐ వెల్లడించింది.  శ్రీధర్ రెడ్డి అవుతు, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిసా, సుద్దులూరి అజయ్ అమృత్ లపై చార్జ్‌ షీట్లు దాఖలు చేసినట్లు గతంలోనే సీబీఐ తెలిపింది. 

నిందితులను ఈ ఏడాది అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సీబీఐ అరెస్టు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులు శ్రీధర్ రెడ్డి అవుతు, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిసా, సుద్దులూరి అజయ్ అమృత్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజా పరిణామంతో ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేసిన మొత్తం నిందితుల సంఖ్య 11కి చేరింది. 

విచారణలో మొబైల్స్, ట్యాబ్లెట్లు సహా మొత్తం 13 డిజిటల్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 53 మొబైల్ కనెక్షన్లకు సంబంధించిన కాల్ డిటైల్స్ రికార్డులను సీబీఐ సేకరించింది. ఈ కేసులో 12 మంది నిందితులు, 14 మందిని విచారించారు. విచారణ సమయంలో.. డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నిక్ ఉపయోగించి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నుంచి కూడా ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

click me!