మాఘ మాసం వచ్చేసిందోచ్ .. ఇక పెళ్లిళ్లే పెళ్లిళ్లు .. ఒక్కటికానున్న వేలాది జంటలు

By Siva Kodati  |  First Published Feb 11, 2024, 2:54 PM IST

మాఘ మాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఈ మూడు నెలల్లోనే ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 13 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఈ నెలలో 11, 12, 14, 16, 21, 22, 28, 29 మార్చి 6, 8, 14, 29 తేదీలు పెళ్లిళ్లకు అత్యంత శుభప్రదమైన రోజులు కావడంతో ఆ రోజుల్లో వేలాది పెళ్లిళ్లు జరిగే అవకాశాలు వున్నాయి. 


మాఘ మాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. నిన్నటి నుంచి ఏప్రిల్ 287 వరకు మంచి ముహూర్తాలు వుండటంతో వేలాది జంటలు ఒక్కటికానున్నాయి. దీంతో పెళ్లి సామాగ్రి, బట్టలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారితో దుకాణాల్లో రద్దీ నెలకొంది. వీటితో పాటు ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, కళ్యాణ మండపాలు, ఫోటో వీడియోగ్రాఫర్‌లు, పురోహితులు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజర్లు, అద్దె వాహనాలకు బుకింగ్ మొదలైంది. ఈ మూడు నెలల్లోనే ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 13 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. 

మరోవైపు.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్‌పై యువత మొగ్గుచూపుతున్నారు. నిన్నటి మొన్నటి వరకు సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు మాత్రమే ఈ రకం వివాహాలు చేసుకునేవారు. ఇప్పుడు సామాన్యులు సైతం ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. విదేశాల్లో కాకుండా ఇండియాలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు కూడా బాగానే ప్రజల్లోకి వెళ్లింది. దీనిలో భాగంగా ఉదయ్‌పూర్, జైపూర్‌‌తో పాటు కేరళ, గోవా, సిమ్లా, కశ్మీర్, ఖజురహో, ఆగ్ర వంటి నగరాలను డెస్టినేషన్ వెడ్డింగ్‌‌‌లకు ఎంచుకుంటున్నారు. కొందరైతే తాము నివాసం వుండే నగరాల్లోనే రిసార్టులు, ఫాం హౌస్‌లను ఎంచుకుంటున్నారు. 

Latest Videos

కాగా.. పూజలు, శుభాకార్యాలకు మాఘమాసం పెట్టింది పేరు. వైశాఖ, కార్తీక మాసాల తరహాలోనే ఈ మాసంలో నదీస్నానాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వివాహాలు, గృహ ప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, నామకరరణం వంటి శుభకార్యాలు ఈ నెలలో ఎక్కువగా జరుగుతాయి. ఈ నెలలో 11, 12, 14, 16, 21, 22, 28, 29 మార్చి 6, 8, 14, 29 తేదీలు పెళ్లిళ్లకు అత్యంత శుభప్రదమైన రోజులు కావడంతో ఆ రోజుల్లో వేలాది పెళ్లిళ్లు జరిగే అవకాశాలు వున్నాయి. 

click me!