హెచ్చరిక: రాగల మూడురోజులు ఏపీలో భారీ వర్షాలు

By Arun Kumar PFirst Published Nov 29, 2020, 10:05 AM IST
Highlights

ఇప్పటికే నివర్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై విరుచుకుపడి అతలాకుతలం చేసి విషయం తెలిసిందే. ఈ గండం నుండి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న ఈ రాష్ట్రాలను మరో రెండు తుఫాన్ల ముప్పు వెంటాడుతోంది. 

విశాఖపట్నం: రానున్న మూడు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. 

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. రాగల 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారి డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
ఇప్పటికే నివర్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై విరుచుకుపడి అతలాకుతలం చేసి విషయం తెలిసిందే. ఈ గండం నుండి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న ఈ రాష్ట్రాలను మరో రెండు తుఫాన్ల ముప్పు వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం డిసెంబర్ 2న బురేవి, 5న టకేటి తుఫాన్ల రూపంలో ఈ రెండు రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని తెలుస్తోంది. 

ఇప్పటికు నివర్ తుఫాను దాటికి తీవ్రంగా నష్టపోయిన ఇరు రాష్ట్రాల రైతాంగానికి మరో రెండు తుఫాన్లు విరుచుకుపడనున్నాయన్న వార్త తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.  నివర్ కారణంగా భారీ వర్షాలు కురియడంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తాయి. మరో రెండు తుఫాన్ల ప్రభావంతో ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తకు సిద్దమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి' తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంద అంచనా వేస్తున్నారు.  
 

click me!