పొత్తులు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: వైసీపీ నేత ఉమ్మారెడ్డి

By Nagaraju TFirst Published Dec 23, 2018, 11:30 AM IST
Highlights

రాబోయే సార్వతిక ఎన్నికల్లో పొత్తులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు ఉమ్మారెడ్డి.
 

విశాఖపట్నం: రాబోయే సార్వతిక ఎన్నికల్లో పొత్తులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు ఉమ్మారెడ్డి.

 ఆంధ్రప్రదేశ్‌లో విజయం ఎవరిది అనే అంశంపై ఇండియాటుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఉమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని తెలిపారు. 

 
మరోవైపు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విజయం ఎవరిది అనే అంశంపై జరిగిన డిబేట్ లో పాల్గొన్న సీఎం రమేష్ ఏపీలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయలా? లేదా అనే అంశంపై ఇంకా చర్చించలేదన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు.  
 

click me!