భూముల్ని ఆక్రమించిన టీడీపీ నేతలపై చర్యలు: విజయసాయిరెడ్డి

Published : Dec 21, 2020, 07:32 PM ISTUpdated : Dec 21, 2020, 08:00 PM IST
భూముల్ని ఆక్రమించిన టీడీపీ నేతలపై  చర్యలు: విజయసాయిరెడ్డి

సారాంశం

జిల్లాలో టీడీపీ నేతలతో కుమ్మక్కై కొందరు రెవిన్యూ అధికారులు రికార్డులను తారు మారు చేశారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు.

విశాఖపట్టణం: జిల్లాలో టీడీపీ నేతలతో కుమ్మక్కై కొందరు రెవిన్యూ అధికారులు రికార్డులను తారు మారు చేశారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు.

సోమవారం నాడు సాయంత్రం విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో టీడీపీ నేతలు ఆక్రమించుకొన్న భూములను తిరిగి తీసుకొంటున్నామని ఆయన చెప్పారు. తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వచ్ఛంధంగా టీడీపీ నేతలు తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. లేకపోతే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.

also read:ప్రభుత్వ భూముల్లోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్: విజయసాయిరెడ్డి

భూ బకాసురులను ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొన్న వారు ఏ పార్టీ వారైనా వారిని వదిలిపెట్టబోమన్నారు.విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్  నివేదిక తయారైందన్నారు. వారం రోజుల్లో సిట్ ప్రభుత్వానికి నివేదిను ఇవ్వనున్నట్టుగా ఆయన చెప్పారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిని అరెస్ట్ చేసేందుకు వెనుకాడమని ఆయన తెలిపారు.ప్రభుత్వ భూమిలోనే విశాఖపట్టణంలోనే ఎగ్జిక్యూటివ్ ను నిర్మిస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే