కాపు కోటా: పవన్ వైపా.. కొత్తపార్టీయా?

Published : Sep 27, 2018, 04:00 PM IST
కాపు కోటా: పవన్ వైపా.. కొత్తపార్టీయా?

సారాంశం

తమ డిమాండ్ల సాధన కోసం రాజకీయ పార్టీని పెట్టడడమో... లేక తమకు న్యాయం చేస్తామని  నమ్మకం ఉన్న పార్టీలో చేరడమో చేస్తామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.  

అమరావతి: తమ డిమాండ్ల సాధన కోసం రాజకీయ పార్టీని పెట్టడడమో... లేక తమకు న్యాయం చేస్తామని  నమ్మకం ఉన్న పార్టీలో చేరడమో చేస్తామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం నాడు కలిశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని  ఇచ్చిన హమీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కాపులకు పదివేల కోట్ల రూపాయాలతో కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ వ్యాఖ్యలపై కూడ ఆయన మండిపడ్డారు. 

అమ్ముడుపోవడానికి తాము పశువులమా అని ముద్రగడ ప్రశ్నించారు.  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాపుల అభిప్రాయాలను సేకరించనున్నట్టు ఆయన చెప్పారు.  కాపు ఉద్యమ నేతలు, మాజీ అధికారులను కలిసి  త్వరలోనే రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

వైసీపీచీఫ్ వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ల విషయంలో ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగానే స్పందించారు. మరోవైపు టీడీపీ కూడ ఇచ్చిన హమీలను అమలు చేయలేదనే అభిప్రాయంతో ముద్రగడ ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ప్రస్తుతం అంతగా బలం లేదు. ఈ తరుణంలో జనసేన వైపు ముద్రగడ మొగ్గుచూపుతారా... లేదా కొత్త పార్టీని పెట్టుకొంటారా అనే  విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే