బీసీల ప్రగతిలో మేమే నెంబర్ వన్: చంద్రబాబు

By narsimha lodeFirst Published Feb 6, 2019, 3:22 PM IST
Highlights

బీసీలకు  ప్రాధాన్యత ఇచ్చి 26 కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.


అమరావతి: బీసీలకు  ప్రాధాన్యత ఇచ్చి 26 కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు  నెలకు రూ.2 వేలను నిరుద్యోగ భృతిగా ఈ ఏడాది మార్చి నుండి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే  తీర్మానానికి సమాధానంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు చర్చను ప్రారంభించారు.టీడీపీ అధికారంలోకి లేని సమయంలో బీసీలను అణగదొక్కారని బాబు చెప్పారు. 

టీడీపీకి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. అగ్రవర్ణాలకు కూడ ప్రాధాన్యత ఇచ్చి కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.

కాపులకు కూడ కార్పోరేషన్‌తో పాటు  5 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత ఏపీ రాష్ట్రానిదేనని ఆయన చెప్పారు.  పసుపు కుంకుమ కింద 94 లక్షల డ్వాక్రా సంఘ సభ్యులకు రూ.10 వేల చొప్పున  చెల్లించినట్టు ఆయన గుర్తు చేశారు. 

పేదరికం తొలగించడమే తన ధ్యేయంగా ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మనం అగ్రస్థానం సాధించిందన్నారు. విదేశీ పెట్టుబడులు సాధించడంలో ఏపీ ముందుందని చెప్పారు. ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడ సంక్షేమ పథకాల అమల్లో రాజీ పడలేదని బాబు చెప్పారు. 

ఏపీకి కియా  కార్ల పరిశ్రమను తీసుకొస్తే తామే తీసుకొచ్చినట్టుగా  బీజేపీ నేతలు చెప్పుకొంటున్నారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తండ్రి వైఎస్ఆర్  అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. తాను రాష్ట్రంలో వందల ఫ్యాక్టరీలను తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు.  రాబోయే రోజుల్లో గుజరాత్ కంటే ఏపీకే ఎక్కువ పరిశ్రమలు రానున్నాయని ఆయన చెప్పారు.
 

click me!